మీ వ్యూస్

ఏదీ హీరో స్టామినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృవ హిట్టయ్యంది. అందరూ అదే మాట అంటున్నారు. రామ్‌చరణ్‌కు హిట్టుపడిందన్న మీడియా టాక్ కూడా బాగానే వర్కవుట్ చేశారు. కానీ, ఇందులో హీరో స్టామినా ఎంత? అన్న ప్రశ్నకే సమాధానం లేదు. తనీ ఒరువన్ హిట్టుకు రీమేక్ ఒకటైతే, అరవింద్‌స్వామి విలనిజం, గ్రాండియర్ షూట్‌తో సినిమాకు ఆమాత్రం టాక్ వచ్చిందేమోగానీ, చరణ్ టాలెంట్ ఏమాత్రం ఏమీ లేదన్నది నిజం. ఈ విషయాన్ని ప్రస్తావనకు తేకుండా సినిమా హిట్టు అంటూ అతని ఖాతాలో వేసేయడం -తనలోవున్న నిజమైన హీరోని చంపేసుకోవడమే అవుతుంది. కాదంటారా?
పల్లవి, సికింద్రాబాద్

ఆహ్వానించారు
మనసులో ఏమున్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఖాన్‌త్రయంతోబాటు బాలీవుడ్ నటీనటులు పెద్దనోట్ల రద్దును ఆహ్వానించారు. రవినాటాండన్ అమెరికా వీసాకోసం రోజుల తరబడి క్యూలో నిలుచోడానికి లేని బాధ, బ్యాంక్ క్యూలో నిలబడడానికి ఎందుకు? క్యూలో ఇబ్బంది పడుతున్నవారికి నీళ్లు, నాలుగు బిస్కెట్లు ఇవ్వకపోగా పార్లమెంటులో ఎందుకు రభస? అని నిలదీసింది. పవన్‌కళ్యాణ్ రద్దుని నిరసించినా, కాంగ్రెస్‌వాడైన నాగబాబు రద్దును గట్టిగా సమర్ధించాడు. బాహుబలి ఆఫీసుల్లో ఐటి సోదాలవల్ల కాబోలు మిగిలిన నటులు, నిర్మాతలు నోరు మెదపడంలేదు!
- కె.సుభాష్, శ్రీనగర్

ఘంటసాల కూడా...
వారం వారం శరత్‌కాలంలో ఎన్నో తెలియని విషయాలు, చూడని ఫొటోలు చూసి కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. రాజనాల చక్కగా స్పష్టంగా గంభీరంగా హావభావాలతో సంభాషణలను చెప్పగల దిట్ట. అలాగే కాంతారావు. ఈ ఇద్దరు విలన్ హీరోలుగా అనేక జానపద చిత్రాల్లో నటించి మన్ననలను పొందారు. ఇద్దరూ ఎంతో ధనం సంపాదించినా చివరి దశలో ఆర్థిక బాధలను అనుభవించారు. ఆర్.నాగేశ్వరరావు ఇంటి పేరు కూడా రాజనాల కావడం యాధృచ్ఛికం. ఈయన 59 ఏళ్లు జీవించలేదు. 1959లో తన 31వ ఏట మరణించాడు. రాజనాల, కాంతారావులకు తమ పిల్లలకు తాము నటించిన పాత్రల పేర్లు పెట్టడం సినిమాపై వారికున్న మమకారాన్ని తెలిపింది. మహాకవి కాళిదాసు చిత్రంలో శ్యామలా దండకం పాడిన తరుణంలో కుమార్తె జన్మించగా ఘంటసాలవారు ఆమెకు శ్యామల అనే పేరు పెట్టారు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

తప్పక రాయండి
ఫ్లాష్‌బ్యాక్‌లో 50 ఏళ్ల క్రితంనాటి సినిమాల గురించి రాస్తున్నారు. ఇప్పటికే మనోహర, సర్వర్ సుందరం డబ్బింగ్ చిత్రాలు గురించి రాశారు. అలాగే ఎం.జి.ఆర్, భానుమతి, బి.సరోజాదేవి నటించిన నాడోడిమన్నన్ (తెలుగులో అనగనగా ఒక రాజు, శివాజీగణేశన్, జమున నటించిన తంగమలై రహస్యం (రత్నగిరి రహస్యం), అంజలిదేవి, రంజన్ నటించిన నీలిమలై తిరుడన్ (కొండవీటి దొంగ), ఎం.జి.ఆర్, జయలలిత నటించిన అడిమైపెణ్ (కొండవీటి సింహం), శివాజీగణేశన్, పద్మిని నటించిన ఉత్తమపుత్రన్ (వీరప్రతాప్), శివాజీగణేశన్, సావిత్రి నటించిన వానంగాముడి (తలవంచని వీరుడు), శివాజీగణేశన్, సావిత్రి, జెమినీ గణేశన్ నటించిన వీరపాండ్యకట్టబొమ్మన్ (వీరపాండ్య కట్టబ్రహ్మన్న), చిత్రాల గురించి వ్రాయాలని నా విన్నపం. పై చిత్రాలన్నీ తెలుగులో విజయవంతమయ్యాయి. సమయం తీసుకున్నా దయచేసి వాటి గురించి తప్పక వ్రాస్తారని ఆశిస్తూ..
- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

చెట్టులెక్కగలవా?
చెంచులక్ష్మి చిత్రంలో ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా, చిలకాగోరింక కులికే పకాపకా పాటలను ముందుగా పాడింది ఈ చిత్రంలో ఘంటసాల, జిక్కీనే. పాటల రికార్డులు బాగా అమ్ముడుపోవడంతో కొలంబియా కంపెనీవారు తమ ఆర్టిస్టులైన శ్రీనివాస్, సుశీలతో మళ్లీ పాడించి రికార్డులు విడుదల చేశారు. ఘంటసాల, జిక్కీ పాడినవి హెచ్‌ఎంవి లేబుల్‌పై వచ్చిన రికార్డులు.
- డి.ఎస్.శంకర్, వక్కలంక

అనకూడదు కానీ..
తమిళనాడు సిఎం జయలలిత మరణానికి దేశమంతా పెద్దఎత్తున నివాళులు అర్పించారు. మీడియా మరింత ఉద్విగ్నతతో రోధించింది. తెలుగు వారిపై ఆమె దృక్పధం చాలా బాధాకరంగా వుండేది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రాకుండా ఆమె అడ్డుకున్నారు. తమిళనాడులో తెలుగు పాఠశాలల విషయంలోనూ అంతే వ్యతిరేకత ప్రదర్శించారు. తెలుగు భాష చదవడానికి లేదని శాసనం తీశారు. విప్లవ నాయకి అంటారు కానీ ఆమె ఏ విప్లవంలో పాల్గొందో ఏం తీసుకొచ్చిందో అర్ధంకాదు. కిలోల బంగారం, లెక్కకు మించిన ఆస్తులు, నల్లధనంపై జైలు జీవితం, అహంకార స్వభావం ఆమె సొంతం. మేధావంతురాలని అందరూ రాశారు, ఆమె ఎన్ని గ్రంథాలు రాశారు? గొప్ప నటీమణులెందరు లేరూ ఆమెకన్నా? ఆమె మరణంతో అందరూ మాస్ హిస్టీరియాకు గురయ్యారా? అరవ దేశంలో ఇలాగే ప్రచారం ఇవ్వడం పరిపాటి.
- జి.కళ్యాణ్, కె.ఎస్.గట్టు, పగో జిల్లా

కవితతో ప్రయోజనమా?
జనసేన సేనాని పవన్‌కళ్యాణ్ నోట్ల రద్దుపై స్పందించి మిత్రుని కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఎట్టాబతికేది? ఎట్టా చచ్చేది? 10 శాతం పందికొక్కుల్ని పట్టుకోడానికి 90 శాతం బతుకులు ఎరగామారాలా? అని కవిత ప్రశ్నించింది. కవిగారి హ్రస్వదృష్టికి నోట్ల రద్దువల్ల కాశ్మీర్ చల్లబడడం, ఉగ్రవాదులకు ధన ప్రవాహం ఆగడం, మాదక ద్రవ్యాల మాఫియా జోరు తగ్గడం, ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్న నకిలీ నోట్లు చిత్తుకాగితాల్లా మారిన విధానం కనిపించలేదు. ప్రజల కష్టాలు తాత్కాలికమే! వారిపై సానుభూతి ఉంటే ప్రజల్లోకి రండి! చిల్లర కొరత అధిగమించడానికి ఏం చేయాలో ప్రజలు, వర్తకులు, ప్రభుత్వంతో చర్చించండి. హైదరాబాద్‌లో కూర్చుని కవితలు రాసుకుంటూ జబ్బలు చరుచుకుంటే ఏం ప్రయోజనం?
- జె.జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్