మీ వ్యూస్

కనులు కనులను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం వైవిధ్యంగా రూపొంది ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చింది. అన్ని దుష్టపాత్రలతో ఓ కథ తయారుచేయలేమని ఇండస్ట్రీలో టాక్ వుండేది. దాన్ని తప్పు అని నిరూపించిన ఈ కథలో పాత్రలన్నీ వైవిధ్యంగానే వుంటాయి. అన్ని పాత్రలూ చెడు నడతతోనే వుంటాయి. కానీ దర్శకుడు ప్రతిభతో సినిమా ఎక్కడా బిగి సడలకుండా చూసే ప్రేక్షకుణ్ణి కుర్చీలోంచి లేవనీయకుండా సాగింది. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ, అనీష్ కురువిల్ల లాంటి మంచి నటులతో సినిమా అద్భుతంగా ఆకట్టుకునేలా వుంది. ఇలాంటి ఆధునిక టెక్నాలజీని అనుసరించిన కథలు మన తెలుగు చిత్రాల్లో కూడా వస్తే బాగుండనిపిస్తుంది. చూసినంతసేపు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతి కలిగింది.
-ఎస్వీ, రాజమండ్రి
ఆయన గ్రేట్!
వెనె్నలలో -ఆదోని అంకిత బి విఠలాచార్యను అవమానించినట్టు రాశారు అది తగదు. విఠలాచార్య తీసిన సినిమాలు దర్శకుడు శాంతారామ్‌కి పిల్లల సినిమాలలా అనిపించాయన్నట్టు వక్కాణించారు. ఆ కాలంలో ఉత్త కెమెరాతోనే ట్రిక్ ఫొటోగ్రఫీ చేసి చూపెట్టిన దర్శకుడు విఠాలాచార్య. ఇపుడే కనుక ఆయనుంటే -ఈ గ్రాఫిక్స్ యుగంలో ఇంకెన్ని వింతలు చూపేవాడో. మంగమ్మ శపథం, పిడుగురాముడు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, లక్ష్మీకటాక్షం, బందిపోటు, అగ్గిబరాటా, అగ్గిపిడుగు ఇవన్నీ ఎన్టీఆర్‌తో తీసి హిట్‌కొట్టిన చిత్రాలు. నిర్మాతలకు కాసుల వర్షాలు కురిపించాయి. అంకిత ఏ చిత్రాలు ప్రజాదరణకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ఎవరికి ఫ్లాప్‌లు లేవు? ముందుతరాన్ని గొప్పవాళ్లని చెప్పుకోకున్నా ఫరవాలేదు, కించపర్చేలా రాయకూడదన్నది కనీస మర్యాదకదా.
-ఎస్ లియాఖత్ అలీ, ఆదోని

అలరిస్తున్నాయి
గత కొంతకాలంగా వెనె్నల్లో వస్తున్న స్వర్ణయుగ సినీయుగ ప్రస్తావనలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్న నటుల గురించి ఇస్తున్న వ్యాసాలు ఆసక్తిగా చదువుతున్నాం. సినీరంగం గురించి, సన్నివేశాల చిత్రీకరణ గురించి తెలియబరుస్తున్న వివరాలు ఈ శీర్షికకు వేయి వెలుగులు చేకూరుస్తున్నాయి. కోడలుపిల్ల సినిమా షూటింగ్‌లో నటి కెఆర్ విజయపై రేప్ సీన్ చిత్రీకరించే సమయంలో జరిగిన విశేషాలు ఆసక్తికరం అనిపించాయి. వారి మంచితనం, భావప్రకటీకరణను రచనలో వ్యక్తపరిచిన విషయాలు అలరిస్తున్నాయి. ఇలాంటి విషయాలు తెలియపరుస్తున్నందుకు సంపాదక వర్గం, రచయితకు హృదయపూర్వక అభినందనలు.
-టిఎస్ రామాంజనేయులు, జగ్గయ్యపేట
సాహితీవేత్తలు
సినిమాలు, సాహితీవేత్తలు అన్న వ్యాసంలో 1935లో విడుదలైన శ్రీకృష్ణలీలలుతో పింగళి నాగేంద్రరావు సినీ రంగ ప్రవేశం చేశారన్నారు. అది సరికాదు. జగన్నాథ్ నిర్మించిన మోలియర్ నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న భలే పెళ్లి (1941)కి రచన చేసి తొలిసారిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఎనిమిదేళ్ల విరామం తరువాత కెవి రెడ్డితో కలిసి గుణసుందరి కథ చిత్రంతో జైత్రయాత్ర ప్రారంభమైంది. అదేవ్యాసంలో మల్లాది రామకృష్ణశాస్ర్తీ జయసింహ చిత్రంలో పాటలు రాసినట్టు పేర్కొన్నారు. ఆ చిత్రంలో మల్లాదికి ఒక్క పాటా లేదు. పెళ్లిసందడి, శభాష్ రాముడు చిత్రాలు 1960లో విడుదల కాలేదు. అవి రెండూ 1959లో విడుదలయ్యాయి.
-పూజారి నారాయణ,
అనంతపూర్
ఊహించలేరా?
ఇటీవల వస్తున్న తెలుగు సినిమాలను చూస్తుంటే రాశి తగ్గిపోతోంది అనిపిస్తుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు సినిమాలే కాదు. ఈ సినిమాల్లో ఏముందని? సరిలేరు నీకెవ్వరు చూస్తుంటే సీరియల్, డ్రామా గుర్తొచ్చాయి. ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష. అందుకే ఆ తరువాత నిడివి తగ్గించారట! ప్రేక్షకుల్లోనూ కళాభిరుచి తగ్గుతోందేమో అనిపిస్తుంది వాటిని హిట్లు అంటుంటే. అల వైకుంఠపురములో కూడా పాత ఇంటిగుట్టు చిత్రానికి కాపీ అంటున్నారు. త్రివిక్రమ్ ఇదేవిధంగా సినిమాలు తీస్తే కనుమరుగవ్వడం ఖాయం. అజ్ఞాతవాసి చిత్రంలో హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్‌లో టాయిలెట్ కమోడ్‌మీద కూర్చుని సిగరెట్ తాగుతూ హీరోతో తన బాధ చెప్పుకుంటుంది. ఇటువంటి సీన్లు ద్వారా ఈ దర్శకులు తామే గొప్పనుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులు ఇబ్బంది పడతారని కొంచెం కూడా ఊహించరా?
-వి బాలకృష్ణ, తిరుపతి
బూచాళ్లు బాబోయ్!
పాతతరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణలు అందాల నటులుగా ప్రేక్షకులను అలరించారు. వారి క్రాఫ్, దుస్తులను ప్రేక్షకులు అనుకరించేవారు. ఇప్పటి హీరోలు గెడ్డం, సగం క్రాఫ్‌లతో చూస్తే గుర్తుపట్టలేకపోతున్నాం. అమెరికాలో ఒక ఇల్లు చూస్తే అన్ని ఇళ్లు చూసినట్టుగా, చైనావాళ్లను ఒక్కడిని చూస్తే ఇంకొకడిని చూడాల్సిన అవసరం లేదన్నట్టుగా.. ఎవరెవరో తెలీకుండా ఉంటున్నారు మన నట బూచాళ్లు. సినిమాలు ఎలాగూ బాగుండటం లేదు. వీరి భయానక వేషధారణలు చూసి సినిమాలకు పెద్దతరం ప్రేక్షకులు ఎందుకొస్తారు. తెలుగు సినిమా గతి ఇంతే. ప్రేక్షకుల గతి అంతేనని ఆత్రేయ పాటకు పేరడీ రాసుకోవాలేమో.
-ఎస్‌ఎల్ నరసింహమూర్తి, హైదరాబాద్