మీ వ్యూస్

గెలిచాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస ఫ్లాపులతో సతమతమైన హీరో నితిన్‌కు ఉత్సాహాన్నిచ్చింది - భీష్మ. ఏడాదిన్నర తరువాత మళ్లీ స్క్రీన్‌కు వచ్చినా -ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే కథతో సినిమా చేయడం బావుంది. నిజానికి భీష్మ గొప్ప చిత్రం అనిపించలేదు. కాకపోతే, వినోదానికి లోటులేకుండా, ఎక్కడా బోర్ అన్న ఫీలింగ్ రాకుండా దర్శకుడు వెంకీ కుడుముల సినిమాను తీర్చిదిద్దిన విధానం బావుంది. ‘ఆర్గానిక్ అగ్రికల్చర్’ పాయింట్‌ని ఉపన్యాసంగానో, చాంతాడంత సందేశంగానో చెప్పకుండా -సింపుల్ నేరేషన్‌తో అర్థమయ్యేలా చెప్పడం బావుంది. ఇక నితిన్- రష్మిక జోడీ చూడముచ్చటే. పెద్ద హీరోల పక్కనా, మీడియం రేంజ్ హీరోలతోనూ బ్యాలెన్సింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న రష్మిక ప్రతిభను మెచ్చకుండా ఉండలేం. ఏదేమైనా కుటుంబ సమేతంగా చూడతగ్గ చక్కటి సినిమా భీష్మ. సందేహం లేదు.
-మల్లిడి వీర, రాజోలు
శాంతినివాసం
ఫ్లాష్‌బ్యాక్ కథనంగా ఇచ్చిన ‘శాంతినివాసం’లో -ఆ కథను పద్మనాభం నాటకంగా ప్రదర్శించేవాడని, ఆయన పోషించిన పాత్రను ఏఎన్నార్ సినిమాలో పోషించారని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. పాత చిత్రాలను గుర్తు చేస్తూనే.. తెరవెనుక విషయాలు సహా సినిమా వివరాలను కూలంకషంగా అందిస్తోన్న రచయిత్రి మాణిక్యేశ్వరికి అభినందనలు. దెబ్బకు దెయ్యం దడుస్తుందన్న సూత్రాన్ని బహుశా మొదటిసారి గయ్యాళి భార్యను దారిలో పెట్టడానికి ఈ చిత్రంలో నాగయ్య ఉపయోగించడం ఆ రోజుల్లో మాకు భలేగా నచ్చింది. ఈనాటికీ సినిమాల్లో గయ్యాళికి బుద్ధి చెప్పడానికి అదే సూత్రం ఉపయోగించడం సరికాదు. భార్యని కొట్టడం గృహహింస అవుతుందని హక్కులరాయుళ్లు ఆక్షేపిస్తారు మరి!
-ఎస్ అయోధ్యారాం, పెద్దాపురం
గ్లామరస్‌గానే..
హీరో హీరోయిన్లు గ్లామరస్‌గా కన్పిస్తారు. కనిపించాలి కూడా. కానీ అమ్మ, ఆంటీ పాత్రలు పోషించేవారూ గ్లామర్ కోసం పాకులాడటం ఆశ్చర్యం. పొందికగా, హుందాగావుండే గృహిణి పాత్రలు పోషించే నటి ప్రగతి, భుజం కింద టాటు వేయించుకొని అది అందరికీ కనిపించేటట్టు స్లీవ్‌లెస్ జాకెట్‌తో ఒక కార్యక్రమానికి హాజరైందని పత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ కథనాలు వినిపించాయి. మన రాష్ట్రంలో కాదుగానీ, ఉత్తరాదిలో కాలేజీ అమ్మాయిలు, మహిళా లెక్చరర్లు, గృహిణులు, ముసలివారు కూడా స్లీవ్‌లెస్‌గానే కన్పిస్తారు. అది గ్లామర్ కోసం కాదు. చెమట చిరచిర నుంచి రక్షణకోసం. అందుకు విమర్శలు అనవసరం. మన మహిళలు ఉత్తరాదిలో సెటిలైనా అలాగే కనిపిస్తారు సరిగ్గా చూస్తే.
-ఆర్‌ఎస్ చంద్రిక, సామర్లకోట
నిండుదనం
రష్మిక సినిమాకు రెండుకోట్లు తీసుకుంటుందట. పూజ హెగ్దె రెండు కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు, తన సిబ్బంది ఆరుగురి ఖర్చు నిర్మాత నెత్తిన వేస్తోందట. దర్బార్ సినిమాలో నయన నటించిందేమీ లేకపోయినా రజనీకాంత్ పక్కన నిలబడి ఐదు కోట్లు గుంజిందన్న కథనాలు వచ్చాయి. వీళ్లేకాక సెకెండ్ ఇన్నింగ్స్‌లోవున్న విజయశాంతి, టబు, రమ్యకృష్ణ లాంటివారికీ చిన్న పాత్రలిచ్చి భారీ మొత్తాలు ముట్టజెప్పాల్సి వస్తుంది నిర్మాతలు. ఇలాంటి వార్తలు పత్రికల్లో వస్తుంటే మనం గుండెలు బాదుకుంటాం. సప్లై అండ్ డిమాండ్ ప్రకారం నడిచే వ్యాపారం సినిమా రంగం. ఇలాంటి తారలుంటే సినిమాకు ఒక నిండుదనం వస్తుంది. ప్రేక్షకులు ఫీల్‌గుడ్ అవుతారని నిర్మాతల లెక్క. ఆ ఫీల్ గుడ్ కోసం ఎంతైనా ఖర్చుపెడతారు. గుండెలు బాదుకునే వాళ్లు బాదుకోవచ్చు. దానికీ అభ్యంతరం ఉండదు.
-సి భాస్కర్, అశోక్‌నగర్
తేల్చేస్తారు
ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం, ఇకపై ప్రేమకథల్లో నటించనంటూ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రకటించగానే, ఇదంతా ప్రచార పటాటోపమని కొట్టిపారేశారు కొందరు. ఆఖరి చిత్రం కాబట్టి ప్రజలు తండోపతండాలుగా వచ్చి సినిమా చూస్తారని విజయ్ అనుకున్నాడు. తరువాత అభిమానులు బలవంతం చేయడంతో ప్రేమకథల్లో నటించక తప్పడంలేదంటాడని తేల్చేసారు. ఈ చిత్ర హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా పబ్లిసిటీ స్టంట్ అని అనలేదు కానీ, ‘ఆయనకు ప్రేమకథలు ఇష్టపడే మహిళాభిమానులు ఎక్కువ. వాళ్లుగట్టిగా కోరితే అతను మళ్లీ ప్రేమకథల్లో నటించవచ్చు’ అని లౌక్యంగా చెప్పింది. ప్రేక్షకులు చెప్పింది అదే కదా!
-బి సుబ్బక్క, జగన్నాధపురం
ఏరి ఆ హీరోలు?
గత వెనె్నలలో వచ్చిన అతిథి గంటా శ్రీరామమూర్తి గురించిన విశేషాలు ఆకట్టుకున్నాయి. ఆయనకు దాసరి నారాయణరావుతో అనుబంధం బాగా వుంది. అవే ముచ్చటగా అనిపించాయి. ఏరి ఆ హీరోలు అన్న వ్యాసంలో చక్కగా నటించిన జంతువులపై విశే్లషణ బాగుంది. కామెడీలేని కోతిగోల అంటూ జబర్దస్త్ త్రయం చిత్రం త్రీ మంకీస్‌కి పాపం ఒక్క స్టారే వేశారు. మాణికేశ్వరి శాంతినివాసం గురించి రాస్తూ హిందీ ట్యూన్స్ ఏమిటో ఏ సినిమాకు ఎక్కడ పాడారో అన్నారు. ఈ పాటల్లో జెవి రాఘవులు నిర్వహణలో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చాయని ఆనాటి చిత్రాల గురించి తెలిసినవారు చెబుతారు. ఈమధ్య పెద్దస్టార్స్‌తో కోట్లు ఖర్చుపెట్టి పాటలు చిత్రీకరిస్తున్నారు. పాటలలో సారంగానీ, సంగీత విలువలుగానీ ఎట్రాక్షన్‌కానీ ఉండడంలేదు. అందువలన శాంతినివాసంలోవున్న పాటలు ఇప్పటికీ నచ్చుతున్నాయి ప్రేక్షకులకు.
-ఏవీఎస్, కాకినాడ