మీ వ్యూస్

ముగింపు బావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపత్‌నంది దర్శకత్వంలో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ లాంటి మసాలా చిత్రంలో రాశిఖన్నా అందాలు ఒలకబోసింది. రవితేజ నటనలో మార్పు లేదు. యాక్షన్ సన్నివేశాల్లో ఒకే అనిపించాడు. కెమెరా బావుంది. కథలో ఆసక్తి లేదు. ఇది రవితేజ మార్కు చిత్రమని ప్రేక్షకులు ఇట్టే గ్రహిస్తారు. ముగింపు బావుంది.
-ఎల్ ప్రపుల్లచంద్ర, ధర్మవరం

స్వరాభిషేకం, ఆక్షేపణలు
స్వరాభిషేకం కార్యక్రమంలో చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి. సీనియర్ సముద్రాలతో ప్రారంభించి, మల్లాదివారు, పింగళివారు, ఆరుద్ర, తోలేటి, శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు, జూనియర్ సముద్రాల వంటివారి కార్యక్రమాలు పూర్తయ్యాక, సిరివెనె్నల, చంద్రబోసులు రావాలి. కానీ అలా జరగడం లేదు. శ్రీశ్రీ అయ్యాక సిరివెనె్నలతో, మళ్లీ ఆరుద్ర, ఆఖరున చంద్రబోస్ ప్రత్యక్షమయ్యారు. సీనియర్ సముద్రాల, శ్రీశ్రీలకు ఒక్కోవారం కేటాయించి, సిరివెనె్నలకు రెండువారాలు ఇచ్చారు. శ్రీశ్రీకన్నా గొప్ప రచయతా ఆయన? లేక శ్రీశ్రీ, సముద్రాలవారి పాటలు రెండు వారాలకు సరిపడా లేవా? బాలు ఆనాడూ ఈనాడూ ఇలాంటి కార్యక్రమాల్లో తాను పాడిన పాటలకే ఎక్కువ విశే్లషణ ఇచ్చారు. వేరొక గాయకుడు, గాయని పాడిన పాటలకు అలాంటివి అక్కర్లేకుండా పోయాయి. ఇవన్నీ చూసి అయోమయంగా ఉంది. ఈ కార్యక్రమ రూపకల్పన ఎవరిదైనా బాలు పాత్ర లేకపోవడం అన్నది జరగనే జరగదు. స, శా, షలలో శాను షాగా పలుకుతున్నారు. సరిచూసుకోగలరు.
- డిఎస్ శంకర్, వక్కలంక

చూడలేకపోతున్నాం
ఇటీవల బుల్లితెర ఛానల్‌వాళ్లు శని, ఆదివారాల్లో చెత్త చిత్రాలను పదే పదే ప్రసారంచేస్తూ విసుగు తెప్పిస్తున్నారు. కలేజా, జులాయ్, మిర్చి, మిస్టర్ పర్‌ఫెక్ట్, రచ్చ, బిజినెస్‌మేన్, మొన్న రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి.. లాంటి చిత్రాలను ఒద్దుబాబోయ్ అన్నా ప్రసారం చేస్తున్నారు. నిజానికి వీటిలో దమ్మున్న చిత్రం ఒక్కటీ లేదు. శని, ఆదివారాల్లో కాస్త సేద దీరుదామనుకుంటే ఈ చెత్త చిత్రాలతో విసిగిస్తున్నారు. చెత్తంతా వారంలో మిగతా ఐదురోజుల్లో ప్రదర్శించి, మంచి చిత్రాలను కనీసం ఆదివారమైనా ప్రసారం చేయమని కోరుతున్నాం.
-రాజేంద్ర, పెదపాడు

నేపథ్య గీతాలు
పూర్వం రోజుల్లో బ్యాగ్రౌండ్ సాంగ్‌లని సినిమాలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ వెనకనుండి పాడుతున్నట్టు వచ్చే గీతాలు ఉండేవి. సీతమ్మను వనాలకు తీసుకుపోయే సమయంలో ఎండ కనె్నరుగని ఇల్లాలికి ఎందుకు ఈ వనవాసాలు? ఏ నిమిషానికి ఏమి జరుగునో పాటలో అలరించింది. అందరూ మంచివారే చిత్రంలో ఎవరురా పగవాడు? ఎవరురా మనవాడు? అన్న పాట ఆకట్టుకుంది. ‘వౌనమే నీ భాష ఓ మూగమనసా’ పాటను మంగళంపల్లి ‘గుప్పెడుమనసు’ చిత్రంకోసం అద్భుతంగా గానం చేశారు. ఆడదే ఆధారం/ మనిషికి ఆడదే సంతోషం/ ఆడదే సంతాపం పాటలో అంటూ గృహిణి ఎలా ఉండాలో చెప్పారు. సంసారం ఒక చదరంగం పాటలో సందేశాన్నిచ్చారు. ఇదేనా తరతరాల చరితం/ జ్వలించే జీవితాల కథనం పాటలో రెండు కుటుంబాల మధ్య వున్న వైషమ్యాలను చిత్రీకరించారు. ఇలాంటి పాటలు నేడు కూడా కావాలి, రావాలి.
-గంగాధరుని నాగమల్లిక, గుంటూరు

మార్చండయ్యా!
ట్రెండ్ మార్చండయ్యా వ్యాసం సకాలంలో వచ్చిన సమంజసమైన సలహా. మనవాళ్లే కాదు దాదాపు అందరూ ట్రెండ్‌లో పడి కొట్టుకుపోవడమే సేఫ్ అనుకుంటున్నారు. నలుగురితోపాటు నారాయణ అనడమే బెస్ట్ అని భావిస్తున్నారు. సాహసించి ట్రెండ్ మార్చి, విజయం సాధిస్తే మళ్లీ అదో ట్రెండ్ అవుతుంది. ఏ దృశ్యాన్ని ఎంతసేపు చూపించాలి. శరీర భాష ఎలా వుండాలి? స్క్రీన్‌ప్లే ఎలా సాగాలి? ఇవన్నీ బేసిక్‌గా సినిమా టెక్నిక్సే. ఇవి తెలియకపోవడంవల్లే ప్లాపులు ఎదురవుతున్నాయి. ఏదేమైనా అవసరమే గుణపాఠాలు నేర్పి, ట్రెండ్‌లు మారుస్తుంది.
-పి శాండిల్య, కాకినాడ

బాగుంది
నీతి నిజాయితీ వ్యాసం బాగుంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు ఉన్న సినిమాలు చూసి, అలా చేయడానికి ప్రయత్నించి, జైలుపాలైన వాళ్లున్నారు. సందేశాత్మక చిత్రాలు చూసి, మారిన మనుషులు మాత్రం అరుదు. బలిపీఠం, మనుషులు మారాలి, బొమ్మరిల్లు వంటి సినిమాలు ప్రేక్షకుల్ని ప్రభావితం చేశాయి. అలాగే శ్రీమంతుడి ఆదర్శం కూడా. అసలే ఆంధ్రులది ఆరంభ శూరత్వమే కదా! కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేది నీతులు చెప్పడానికి అంటారు నిర్మాతలు. వినోదం పేరుతో నానా చెత్తా పోగేస్తున్నారు. ఈ చెత్తకన్నా అంతర్లీనంగా ఏదో సందేశం ఉన్నవే హిట్టవ్వడం చూస్తున్నాం.
-పిఎస్ లక్ష్మి, బృందావనం

ఎంత ధైర్యం?
విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం ఓ చరిత్ర సృష్టిస్తే నిన్నమొన్న వచ్చిన శంకరాభరణం అధఃపాతాళానికి తీసుకెళ్లింది. ఏ నిర్మాత చేయని ధైర్యం వీళ్లుచేసి, ఆ సినిమాపై వున్న భక్త్భివాన్ని అగౌరవ పరిచారు. క్రైమ్, కామెడీ కథకు ఇలాంటి పేరు పెడతారా? ఇప్పటికే హిందీలో ప్లాప్ అయిన సినిమాను తెలుగులో రీమేక్‌చేసి దానికి శంకరాభరణం అనే పేరు పెడతారా? తెలుగు సినిమాను ఏం చేయదలుచుకున్నారు వీళ్లు?
-మహమ్మద్ యూసుఫ్, కాజీపేట

ప్రయోజనకరంగా..
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పిల్లల సినిమా పండుగ, దాని ఆశయానికి దూరంగా వెళ్లిపోతోంది. ఏదో ఆర్భాటంగా హడావుడి చేసి ముగించేలా కాకుండా ప్రయోజనకరంగా వుండేలా తీర్చిదిద్దాలి. అసలు పిల్లల సినిమాలు అనే మూసధోరణినుంచి బయటపడి పిల్లలతోపాటు తల్లిదండ్రులు చూసే విధంగా చిత్రాలు నిర్మించాలి. ముందు పేరు ఉన్న దర్శక నిర్మాతలు అలాంటి చిత్రాలను తీయాలి.
- పెయ్యల శ్రీనివాస్, అలికాం