మీ వ్యూస్

కీర్తినార్జించాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళవారం మణిహారాలుగా రెండు చిత్ర సమీక్షలు మంగళప్రదం చేశాయి. ఒకటి మాణిక్కేశ్వరిగారి శ్రీకృష్ణావతారం. ఇందులో రామారావుగారి విశ్వరూపం. ఇతర నటీనటులు పాత్రల పరిపూర్ణత, టి.వి.రాజుగారి రాజా లాంటి మధురమైన సంగీతం చిత్రానికి నిండుతనాన్ని నింపాయి. ఇక పౌరాణిక కావ్యమైన మాయాబజార్ గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఇదొక పరిశీలనాత్మకమైన పరిశోధనా గ్రంథం. పాటలు, మాటలు, అభినయాలు, సంగీతం, దర్శకత్వం అన్ని శాఖలు పింగళి, సాలూరి ప్లస్ ఘంటసాల, ఎన్టీఆర్, ఎఎన్నార్, రంగారావు, రేలంగి, సావిత్రి మొదలైనవారు చిత్ర అఖండ విజయానికి ఆద్యులు. ప్రపంచ సినీ జగత్తులో ఈనాటి వరకు లెక్కకు వచ్చిన మొదటి వంద అత్యుత్తమ చిత్రాలలో మన మాయాబజార్ చోటుచేసుకున్నదంటే ఆనాడు ఎన్ని ఆస్కార్ అవార్డులు రావాలి. ప్రతీ సంవత్సరం కనీసం రెండుసార్లయినా ఏదో ఒక చానల్‌లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతూనే వుంటుంది. ఇంతటి ఘనకీర్తి మరే తెలుగు చిత్రం పొందలేదు.
-ఎన్.ఆర్.ఎల్, హైదరాబాద్