క్రైమ్/లీగల్

గుండెపోటుతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, మార్చి 22: వ్యవసాయ సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, మరో వైపు భార్య అనారోగ్యానికి గురికావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు గుండె ఆగిపోయింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై వివరాలిలా ఉన్నాయి... అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన బోరంచ శంకరయ్య (37) గుండెపోటుతో మృతి చెందారు. వ్యవసాయ సాగు కోసం అప్పులు పెరగడం, భార్య అనారోగ్య పరిస్థితి ఒకవైపు... పిల్లలను వదిలి హైదరాబాద్ వలసపోవడం... చేసిన అప్పులు పెరిగి మనస్థాపానికి గురైన శంకరయ్య గుండెపోటుతో మృతి చెందారు. సీతానగర్ గ్రామానికి చెందిన శంకరయ్య , భార్య లక్ష్మిలకు రెండెకరాల భూమి ఉంది. గత మూడు సంవత్సరాలుగా ఈ భూమిలో పంటలు వేసినా పండకపోవడంతో అప్పులు పెరగడంతో హైదరాబాద్ వలసవెళ్ళారు. ఇతనికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ముగ్గురిని సీతానగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచి సికింద్రాబాద్‌కు పోయి చెరకు బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. అంతలోనే భార్య అనారోగ్యానికి గురి కావడంతో రూ.2 లక్షలకు పైగా అప్పులు చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా ఆమె పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో శంకరయ్య ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు గురయి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు జరుపుతూ ముగ్గురు పిల్లలను స్వగ్రామంలో వదిలిపెట్టడం, దీంతో మనస్థాపానికి గురైన శంకరయ్య బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఒత్తిడుల వల్ల గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో శంకరయ్య మృతి చెందిన విషయం గ్రామంలో తెలియగానే విషాదచ్చాయలు అలముకొన్నాయి. శంకరయ్య కుమార్తెలు నవనీత, స్వాతి, కుమారుడు నర్సింలు ఉన్నారు. తండ్రి మృతి చెందిన వెంటనే స్వగ్రామమైన సీతానగర్‌కు హైదరాబాద్ నుంచి శవాన్ని తీసుకువచ్చారు. ముగ్గురు పిల్లల్లో కూతురు నవనీత పదో తరగతి కావడంతో పక్క మండలమైన పెద్దశంకరంపేటలో గురువారం తన తండ్రి శవం ఇంట్లో ఉండటం, మరో వైపు పరీక్ష రాయక తప్పదని పెద్దశంకరంపేటలో పదో తరగతి గణితం రెండో పరీక్షలను రోదిస్తూనే పరీక్ష రాసింది. ఈమె కన్నీరు పెడుతూ పరీక్ష రాస్తుంటే తోటి విద్యార్థులు సైతం నవనీతను చూసి కంటతడిపెట్టారు. తండ్రి శవం వద్ద నుంచి వచ్చిన నవనీత ఓ వైపు బాధను దిగమింగుతూ పరీక్ష రాయడం పలువురిని కంటతడి పెట్టించింది. శంకరయ్య మృతి విషయం తెలియడంతో గ్రామస్తులు మృతుని ఇంటికి చేరుకొని ఆయన అందరితో ఆప్యాయంగా ఉండే వాటిని గుర్తు చేసుకున్నారు. అందరితో కలిసి ఉండే శంకరయ్య మరణ వార్త చుట్టుపక్కల గ్రామాలను కంటతడిపెట్టించింది. కుటుంబ యజమానిక శంకరయ్య మృతితో భార్య అనారోగ్య పరిస్థితి, పిల్లలు అనాథలుగా మిగిలిపోయారని పలువురు కంటతడిపెట్టారు.