క్రైమ్/లీగల్

రూ.10 లక్షల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 28: గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డులోని టి.వెంకట్‌రెడ్డి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.10 లక్షల విలువైన పత్తి నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా ప్యాకింగ్ చేస్తుండగా టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసు, వ్యవసాయ శాఖ సమన్వయంతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుల్ పెద్దస్వాములు, నజీర్‌లు గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు వెంకట్‌రెడ్డి ఇంట్లో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. ఈ దాడుల్లో క్వింటా 25 కిలోల నకిలీ విత్తనాలు, కలర్ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఓ భవాని, వీఆర్‌ఓలు పంచనామా నిర్వహించి విత్తనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై గద్వాలటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ట్రాస్క్‌పోర్సు పోలీసులు చెప్పారు.
60 కేజీల విత్తనాలు రిజర్వాయర్‌లో పారబోత
జోగుళాంబ గద్వాల జిల్లాలో టాస్క్‌పోర్సు టీంలు వరుసదారులు నిర్వహించడంతో బెంబేలెత్తిన నకిలీ పత్తివిత్తనాల తయారీదారులు సుమారు 60 కేజీల విత్తనాలను ఎవరులేని సమయంలో ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్‌లో పారబోశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టాస్క్ఫోర్స్ టీం, ఏఓ భవాని, సభ్యులు వాటిని గమనించి ర్యాలంపాడు వీఆర్‌ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

ఉరి వేసుకొని వృద్ధ రైతు ఆత్మహత్య
- రైతుబంధు సాయం చోరీతో మనస్తాపమే కారణం..
జడ్చర్ల, మే 28: రైతు ఆత్మహత్యలను శాశ్వతంగా నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం అమలుకు సంబంధించిన డబ్బు చేతికి అందినట్లే అంది, అందకుండాపోవడంతో మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన అర్వ మల్లయ్య(70) అనే వృద్ద రైతు తీవ్ర మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి పెరట్లోని చింతచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్లయ్య పేరిట గంగాపూర్ గ్రామంలో ఏడున్నర ఎకరాల భూమి ఉండగా రైతుబందు పథకం అమలులో భాగంగా పెట్టుబడి సహాయం కింద రూ.33వేల చెక్కు వచ్చింది. చెక్కును ఈ నెల 24న బ్యాంకుకు తీసుకెళ్ళి డబ్బును డ్రా చేసుకుని లెక్కిస్తుండగా ఇద్దరు ఆగంతుకులు మల్లయ్యతో మాటలు కలిపి డబ్బును తాము లెక్కిస్తామని చెప్పి వాటిని కాజేశారు. దీంతో మల్లయ్య జరిగిన ఘటన గురించి బ్యాంకు సిబ్బందికి, చుట్టుపక్కల వారికి తెలిపి వారి సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు కాజేసిన దొంగలు నాలుగు రోజులైనా కుడా దొరకకపోవడంతో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని తాను సద్వినియోగం చేసుకోలేకపోయానని ఆవేదన పడతూ తీవ్ర మనస్తాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ వెంకటనారయణ తెలిపారు.