క్రైమ్/లీగల్

ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ కొరఢా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఏప్రిల్ 10: భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడంతో టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇసుక లారీలు, ట్రాక్టర్ల యజమానులు జాతీయ రహదారిపై గల పోలీసులతో కుమ్మక్కై తమ అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి దాడులు జరపడం అక్రమార్కులను బెంబేలెత్తిస్తోంది. మంగళవారం గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఐదు ఇసుక లారీలను ఎస్పీ టాస్క్ఫోర్స్ సిబ్బంది గొల్లపల్లి వద్ద అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. ఆ లారీలను స్థానిక పోలీసులు తహశీల్దార్‌కు అప్పగించారు. దీంతో ఇన్నాళ్లు అక్రమ ఇసుక రవాణాతో లక్షలాది రూపాయలతో అక్రమార్జాన చేసిన ఇసుకాసురులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా జడ్చర్లలో కొందరి అండదండలతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డ వారు కలెక్టర్, ఎస్పీల దృష్టిలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లనే టాస్క్ఫోర్స్ దాడులు జరిగినట్లు, ఈ దాడులు మరింత ఉద్ధృతంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వీడిన బాలుడి కిడ్నాప్ మిస్టరీ
- 17గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
- ఇన్‌చార్జీ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి
కొత్తకోట, ఏప్రిల్ 10: అక్రమ సంబంధం నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కేసును పోలీసులు 17 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు వంశీకృష్ణ నాయక్ బాలుడ్ని తీసుకుని పూణె పారిపోగా పోలీసులు చాకచక్యంగా బాలుడ్ని రక్షించి తీసుకొచ్చారు. కేసును పోలీసులు చేధించిన వివరాలను మంగళవారం కొత్తకోట సీఐ కార్యాలయంలో ఇన్‌చార్జీ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వివరించారు. నాటవెల్లి ఉరగట్టు తండాకు చెందిన రాజునాయక్ సోదరి నారమ్మ. ఆమెకు మహబూబ్‌నగర్ మండలం వెంకటాపురం రేగడిగడ్డతండా అడవి వెంకటాపురం గ్రామవాసి వంశీకృష్ణనాయక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అయతే, గత కొంతకాలంగా సజావుగా సాగిన వీరిద్దరి మధ్య ఇటీవల గొడవలు ఏర్పడ్డాయ. దీంతో నారమ్మను ఎలాగైనా తనదారిలోకి తెచ్చుకోవాలని వంశీకృష్ణనాయక్ ఆమె మేనల్లుడి కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. నారమ్మ మేనల్లుడైన చందునాయక్ కొత్తకోట పట్టణంలోని భారతీయ విద్యా మందిర్‌లో మూడవ తరగతిని చదువుతున్నాడు. వంశీకృష్ణ నాయక్ ఈనెల 7న పాఠశాలకు వెళ్లి మీ అమ్మకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి చందును బయటకు తీసుకెళ్లాడు. ఆపై బాలుడిని టీఎస్ 10యుబి 0478 అనే నెంబర్ గల ఆటోలో హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. తనతో మునపటిలా సంబంధాన్ని కొనసాగించకపోతే చందునాయక్‌ను చంపుతానని నారమ్మను బెదిరించాడు. ఈ విషయాన్ని నారమ్మ తన అన్న రాజునాయక్‌కు ఫోన్‌లో సమాచారం అందించింది. రాజునాయక్ కొత్తకోట ఎస్‌ఐ, సీఐకి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్, ఎస్‌ఐలు రవికాంత్‌రావులు రంగంలోకి దిగి కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఆటో నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉండటాన్ని గుర్తించారు. వంశీకృష్ణనాయక్ రైలు ఎక్కి పూణె వెళ్లినట్లు అతడి ఫోన్ సిగ్నల్ ద్వారా సమాచారాన్ని పోలీసులు కనుగొన్నారు. అక్కడి రైల్వే పోలీసులతో పాటు ప్రత్యేక దళాలతో బాలుడిని కాపాడారు. కేసును ఛేదించిన పోలీసులను ఆమె అభినందించారు. 17 గంటలోనే కేసును ఛేదించడం పట్ల పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్‌రావు, జములప్ప, డీఎస్పీ సృజన తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

యువకునిపై అటవీ శాఖ అధికారుల దాడి
- చెంచుల ధర్నా
మన్ననూరు, ఏప్రిల్ 10: యువకునిపై అటవీ శాఖ అధికారుల దాడికి నిరసనగా నల్లమల్లలోని వటవర్లపల్లి గ్రామం శ్రీశైలం-హైదరాబాదు ప్రధాన రహదారిపై ప్రజలు ధర్నా నిర్వహించారు. మంగళవారం చిగుర్ల మల్లేష్ అనే యువకుడు తన వాహనంపై మన్ననూర్ నుండి వటవర్లపల్లి వెళ్తు మార్గమధ్యంలోని అడవిలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆగాడు. అటుగా వచ్చిన అటవీ శాఖ రేంజర్ శ్రీదేవి అమానుషంగా కర్రతో దాడికి దిగిందని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారి డీఎఫ్‌వో జోజి గ్రామస్థులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. గంటన్నర పాటు హైవేపై బైఠాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషమమై రేంజర్ శ్రీదేవిని వివరణ కోరగా ‘మల్లేష్ అడవిలో మద్యం తాగుతూ కనిపించాడు. మద్యం సీసాలు పగిలి వన్యప్రాణులకు ప్రాణహాని కలుగుతుంది. సీసాలను తొలగించమని హెచ్చరించిన మాకు ఎదురు తిరిగాడు.’ అని వివరించారు.