మతిపోతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాన్ని ప్రదర్శించడానికి వయసుతో పనిలేదని నిరూపిస్తోంది ఆల్ ఇండియా అతిలోక సుందరి శ్రీదేవి. ముదిమి మీదపడుతున్నా చూపులు తిప్పుకోలేనట్లు సైజ్ జీరో లెవెల్లో హొయలు పోతూ ఫొటోషూట్ చేసింది శ్రీదేవి. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్‌తో చేసిన పులి సినిమాలో పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. ఓ రకంగా ప్రతినాయికగా నటించిన పులి చిత్రంలో ఆమె నటనకు మార్కులే పడ్డాయి. తాను ఎలా స్క్రీన్‌పై కన్పిస్తే ఎలా ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న క్లారిటీ వున్న శ్రీదేవి తాజాగా ఓ మాగ్‌జైన్‌కు ఫొటోషూట్ చేసి ఇచ్చింది. యువ కథానాయికలకు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్న ఈ ఫొటో షూట్ బాలీవుడ్ దిగ్గజాలకు మతిపోగొడుతోంది. తాజా తాజా అందాలు వున్నట్లుగా ఓ మోడల్‌లా ఇందులో కన్పిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్‌లతోపాటుగా మాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు సాగిస్తున్న శ్రీదేవికి ఈ ఫొటోషూట్ మంచి ఫలితాలను ఇస్తుందని బాలీవుడ్ మీడియా వ్యాఖ్యానిస్తోంది.