బిజినెస్

ఆరు వారాల గరిష్ఠానికి సెన్‌సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 86 పాయింట్లు వృద్ధి
ముంబయి, మార్చి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 86.29 పాయింట్లు పెరిగి 6 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 24,804.28 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 28.55 పాయింట్లు అందుకుని 7,538.75 వద్ద నిలిచింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల లాభాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.04 శాతం నుంచి 1.75 శాతం మధ్య పెరిగాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.44 శాతం నుంచి 1.54 శాతం పుంజుకున్నాయి. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లూ లాభాల్లో కదలాడాయి. బ్యాంకింగ్, ఇండస్ట్రీ, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, ఫైనాన్స్, చమురు, గ్యాస్, టెలికామ్, విద్యుత్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 0.81 శాతం నుంచి 0.29 శాతం వరకు లాభపడ్డాయి. అయితే మెటల్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్ల విలువ 2.04 శాతం నుంచి 0.23 శాతం వరకు తగ్గింది.
యుబిహెచ్‌ఎల్ షేర్లపై మాల్యా ప్రభావం
విజయ్ మాల్యాకి చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్) నేతృత్వంలోని యుబి గ్రూప్ స్టాక్స్ సోమవారం 5.3 శాతం వరకు నష్టపోయాయి. 9,000 కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసును మాల్యా ఎదుర్కొంటున్నది తెలిసిందే.
ఈ క్రమంలోనే మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ షేర్ల విలువ 4.05 శాతం, యునైటెడ్ బ్రూవరీస్ షేర్ల విలువ 0.54 శాతం, మెక్‌డౌల్ హోల్డింగ్ షేర్ల విలువ 2.89 శాతం క్షీణించింది.