బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస నష్టాల నుంచి లాభాల్లోకి
సెన్‌సెక్స్ 216 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు వృద్ధి
ముంబయి, డిసెంబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. గడచిన వారం రోజుల్లో సూచీలకు ఇది తొలిసారి లాభాలవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ 3 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. 216.27 పాయింట్లు పుంజుకుని 25,252.32 వద్ద నిలిచింది. అంతకుముందు ఆరు రోజుల్లో ఇది 1,133.36 పాయింట్లు నష్టపోయింది. ఇదిలావుంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 70.80 పాయింట్లు కోలుకుని 7,683.30 వద్ద స్థిరపడింది. ఇటీవల మదుపరులను ఆకట్టుకోలేక నష్టాలపాలైన కమాడిటీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో, టాటా స్టీల్ షేర్ల కొనుగోళ్లకు గురువారం ట్రేడింగ్‌లో మదుపరులు ఆసక్తి కనబరిచారు. ఆయా రంగాలవారీగా ఇంధనం, చమురు, గ్యాస్, మెటల్, రియల్టీ, యుటిలిటీస్, ఐటి, టెక్నాలజీ, విద్యుత్, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు గరిష్ఠంగా 2.41 శాతం, కనిష్టంగా 0.97 శాతం చొప్పున లాభపడ్డాయి. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 1.24 శాతం, మిడ్-క్యాప్ 0.90 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, తైవాన్ దేశాల సూచీలు 0.16 శాతం నుంచి 1.35 శాతం క్షీణించాయి. అయితే దక్షిణ కొరియా సూచీ 0.20 శాతం లాభపడింది. ఇక ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.05 శాతం నుంచి 0.07 పెరగగా, బ్రిటన్ సూచీ 0.30 శాతం పడిపోయింది.