మెయిన్ ఫీచర్

జ్ఞానానికే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అధ్యస్తమైన తాదాత్మ్యభావము కల్గుటకు బుద్ధి మూలకారణము. బుద్ధిద్వారా ప్రేరితమైన మోహము తొలగిపోయిన పిదప, కల్పితమైన భ్రాంతి అంతమైపోవును. దేహముతో తాదాత్మ్యభావము (దేహాత్మభావన) నశించిన వెంటనే, ఉపాధిలో కేవలము సాక్షిగా వ్యవహరించే ద్రష్ట అయిన ఆత్మయందున్న జీవభావము సహజంగా తొలగిపోవును.
199. యావద్భ్రాన్తిస్తావదేవాస్య సత్తా
మిథ్యాజ్ఞానోజ్జృంభితస్య ప్రమాదాత్‌
రజ్జ్వాం సర్పోభ్రాన్తికాలీన ఏవ
భ్రానే్తర్నాశే నైవ సర్పో‚ పి తద్వత్‌॥
మిథ్యారూపమైన అజ్ఞానము ఆవరించిన కారణముగా భ్రాంతి కల్గుతున్నది. రజ్జువు సర్పమనే భ్రాంతి, ఎంతకాలము బుద్ధిలో ఆవరించి ఉండునో, అంతవరకే రజ్జువు సర్పమువలె కనబడును. తాను చూచినది రజ్జువుతప్ప సర్పము కాదని పరిశీలనతో గ్రహించిన పిదప, సర్పమనే భ్రాంతి నాశనమై దాని స్థానములో యథార్థమైన రజ్జువే కన్పించును. అదే విధముగా, యథార్థజ్ఞానము పొందిన అనంతరము, మిథ్యారూపమైన ప్రపంచము, సంసార భ్రాంతి అంతమగును.
శ్రుతి ‘‘తత్ర కో మోహః కః శోకః ఏకత్వ మనుపశ్యతః’’అని దీనినే స్పష్టము చేస్తున్నది. (అవిద్యారూపములైన మోహము మరియు దుఃఖము యథార్థజ్ఞానము పొందిన పిదప తొలగిపోవును - ఈ.ఉ.-7).
200. అనాదిత్వమ విద్యాయాః కార్యస్యాపి తథేప్యతే
ఉత్పన్నాయాం తు విద్యాయా మావిద్యక మనాద్యపి॥
అవిద్యయొక్క కార్యరూపమే బుద్ధ్యాదులకు స్థానమైన విజ్ఞానమయ కోశము. అందువలన, దానికినీ అనాదిత్వము అంగీకరించబడుతున్నది, కాని, తత్త్వజ్ఞాన ప్రాప్తితో, అనాది అయినప్పటికీ అవిద్య పూర్తిగా నశించిపోవును.
స్మృతి దీనినే నిర్ధారిస్తూ ఇట్లు బోధిస్తున్నది ‘‘న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’’ (ఈ ప్రపంచములో జ్ఞానముతో తగు సమానమైన పవిత్రమైనది మరి ఏదియూ లేదు-్భ.గీ.4-38). ఇంకనూ ‘‘జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతి మచిరేణాధిగచ్ఛతి’’ (తత్త్వజ్ఞానము ప్రాప్తించిన వెనె్వంటనే సాధకుడు పరమశాంతిని పొందును- భ.గీ.4-39).
201. ప్రబోధే స్వప్నవత్సర్యం సహమూలం వినశ్యతి
అనాద్యపీదం నో నిత్యం ప్రాగభావ ఇవ స్ఫుటమ్
అనాదేరపి విధ్వంసః ప్రాగభావస్య వీక్షితః॥
స్వప్నావస్థలో కలిగే దృశ్యశ్రవణ అనుభవములు సమస్తము జాగ్రదవస్థకు వచ్చిన వెంటనే పూర్తిగా నశించును. అదే విధముగ, జ్ఞానప్రాప్తితో అవిద్య అనాదైననూ పూర్తిగా అంతమైపోవును. కార్యరూపములో నిర్మితముకాక పూర్వము ఘటము లేదు. అదే ప్రాగభావ స్థితి. పిండోత్పత్తికాక పూర్వము శరీరము లేదు. శరీరము లేకపోయినందువలన అవిద్య లేదు. ప్రాగభావము దానికి ప్రతికూలమైన కార్యోత్పత్తి జరిగిన పిమ్మట పూర్తిగా నశించును.
ఈ విధంగా ప్రాగభావస్థితిని స్పష్టముచేసి, శరీరము లేక పూర్వము అవిద్య లేదు కనుక, అనాది ఐనప్పటికీ అవిద్య జ్ఞానోత్పత్తితో ధ్వంసమైపోవునని విశదీకరించబడినది. ఎట్టి అభావము లేనిది ఆత్మతత్త్వమే. అందువలన, ఆత్మకు నాశన ధర్మము లేదు.
202. యద్బుద్ధ్యుపాధిసమ్బన్ధాత్పరికల్పిత మాత్మని
జీవత్వం న తతో‚న్యత్తు స్వరూపేణ విలక్షణమ్‌॥
ఉపాధి కారణముగా ఆత్మకు ఆపాదింపబడుతున్న జీవత్వము యథార్థముకాదని మరొక పర్యాయము ఈ శ్లోకములో స్పష్టము చేయబడుతున్నది. ఉపాధికొరకు, ఆత్మబుద్ధ్యాది జడపదార్థములకు నిలయమైన శరీరమును ఆశ్రయించినా, పరబ్రహ్మస్వరూపమైన ఆత్మకు సంసారిత్వము ఆపాదించబడదు. జీవత్వమునకు సర్వవిధముల విలక్షణమైన ఆత్మ అసంసారి మరియు నిత్య ముక్తము.
203. సమ్బన్ధః స్వాత్మనో బుద్ధ్యా మిథ్యాజ్ఞానపురస్సరః
వినివృత్తిర్భవేత్తస్య సమ్యగ్‌జ్ఞానేన నాన్యథా॥
బుద్ధితో ఆత్మకు సంబంధము భ్రాంతివలన వచ్చినదే. తత్త్వతః ఆత్మకు దేనితోను సంబంధము, సాంగత్యము లేదు. ఎందువలననగా ఆత్మకు ఇంద్రియములు, అవయములు లేవు. ఆత్మకు బుద్ధితో సంబంధము ఉన్నట్లు కలుగుతున్న అపోహ, సమ్యగ్‌జ్ఞానముతో నివృత్తిఅగును. ఆత్మతత్త్వమును సమగ్రముగా తెలిసికొనుట తప్ప వేరొక మార్గము అజ్ఞాన నివృత్తికి లేదు.
204. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యగ్‌జ్ఞానం శ్రుతేర్మతమ్‌॥
పరమాత్మయొక్క స్వరూపమే జీవాత్మ అనే జ్ఞానము కలిగి ఉండుటయే సమ్యగ్ జ్ఞానముగా నిర్దేశింపబడుతున్నది. సమస్త ప్రాణుల సృష్టిస్థితిలయములకు పరబ్రహ్మమే కారణమని శ్రుతి తెలియజేస్తూ జీవేశ్వరుల అభిన్నతను పలు ప్రకటనలలో ధృవీకరిస్తున్నది.
‘‘అయమాత్మా బ్రహ్మ’’, ‘‘అహం బ్రహ్మాస్మి’’, ‘‘తత్త్వమసి’’, ‘‘సో‚హం’’, ‘‘ప్రజ్ఞానం బ్రహ్మ’’ ఇత్యాది మహావాక్యములు ప్రసిద్ధములు.. ఇవికాక ‘‘అంగుష్టమాత్రః పురుషోమధ్య ఆత్మని తిష్ఠతి’’ (బొటనవ్రేలంత ప్రమాణంలో ఉండే ఈ పురుషుడు శరీర మధ్య భాగంలోనే ఆత్మరూపంలో ఉన్నాడని కఠోపనిషత్తులోను (క.ఉ.2-1-12), ‘‘ఏష హి ద్రష్టా, స్ప్రష్టా, శ్రోతా, ఘ్రాతా, రసయితా, మంతా, బోద్ధా, కర్తా, విజ్ఞానాత్మా పురుషః స పరే‚ క్షర ఆత్మని సంప్రతిష్ఠతే’’ (ఆత్మయే చూచేది, స్పర్శించేది, వినేది, వాసన, రుచులను గ్రహించేది, మననము చేసేది, సమస్తము తెలిసికొనేది, మరియూ చేసేదీ. ఈ అక్షర పరబ్రహ్మమే ఆత్మలో స్థిరముగా ప్రతిష్ఠింపబడినది’’అని జీవేశ్వరుల అభిన్నతి ప్రశ్నోపనిషత్తులోను వినిపిస్తున్నది (ప్ర.ఉ.4-9)..
- ఇంకావుంది...