మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె తండ్రి పేరు భీముడు. (అంతశ్శతువులకు భయంకరుడు) ఇతడి గురువు దమమహర్షి దమము అంటే, సర్వేంద్రియ నిగ్రహం.) ఆ మహర్షి వరంవల్ల పుట్టిన పిల్లల పేర్లు దమయంతి, దముడు, దాంతుడు, దమనుడు. కాగా, ఈ వంశమంతా ఇంద్రియ నిగ్రహంతోనూ, యాగయోగాది సత్కర్మాచరణంతోనూ, నిండి వున్నదని మహర్షి సూచిస్తున్నాడు.
దానికి తగ్గట్టే దమయంతి జీవితమంతా ఇంద్రియ నిగ్రహమే పరచుకొని వుంది. నలుడు చాలాసార్లు తొట్రుపడ్డాడు గానీ, ఆమె ఒక్కసారి కూడా తొట్రు పడలేదు. పైగా, దేవేంద్రాదుల కామరూపశక్తిని ఆమె క్రోధంతో కాకుండా, తన ఉపాసనాబలంతోనూ భక్తితోనూ నిగ్రహించింది. తనను మానభంగం చేయబోయిన బోయవాడ్ణి తపోబలంతో నిగ్రహించింది. నలుడి యొక్క మారు రూపాన్ని ఆమె తన మేధాబలంతో నిగ్రహించింది. కనుక, నిగ్రహశక్తికి ప్రతిరూపమే దమయంతి అని సూచితవౌతోంది.
నలుడు ఎంత ఉత్తమ మానవుడైనా, అతడిలో నిగ్రహశక్తి ఈ స్థాయిలో లేదు. అందుకే పౌరుషశక్తిని సాధనశక్తితో సంయోజనం చేయటంకోసం, వారిద్దరిమధ్యా దూతగా స్వర్ణహంస రూపంలో శివుడు దిగివచ్చాడు.
విశ్వనాథవారు ఉదహరించిన ‘‘హంసశ్శివస్సోహం’’అనే వేద వాక్యం ఇక్కడ బాగా అతుకుతోంది. ఎందుకంటే, ఐహికాముష్మికాలు రెండింటిలోనూ వీరుడై విర్రవీగుతున్న నలుడికి నారాయణత్వం అందాలంటే, వాడిలో నిగ్రహశక్తి పరాకాష్ఠకు చేరాలి. ఆ శక్తిని ప్రసాదించగల సత్తా శివుడికి ఒక్కడికే వుంది.
మూడు కళ్ళు పెట్టుకొని కూడా, ప్రళయ సమయందాకా మధ్య కంటిని తెరవకుండా వుండగల నిగ్రహశక్తి ఆయనకే వుంది. అందుకే ఆయన నరశక్తికీ, దమనశక్తికీ, సంయోజకుడై, నలదమయంతుల మధ్యలో రాయబారం చేశాడు.
శివుడు హంస రూపంలోనే ఎందుకు రావాలి? ఇంద్రియ నిగ్రహశక్తి నిత్యానిత్య వస్తువివేకం ద్వారా మాత్రమే సుస్థిరమై వికసిస్తుంది. ఆ వికాసానికి దగ్గరదారి అజపా గాయత్రీవిద్య. ఈ విద్యకే మరో పేరు హంస విద్య. అదీగాక, నిగ్రహశక్తికి మూల స్తంభం ఆత్మానాత్మ వివేకం. ఇది నీరక్షీర వివేకతుల్యం. దీనికి ప్రతినిధి హంస. ఈ హంస గూడా శివస్వరూపమే. ‘‘జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్’’అని ఆర్యోక్తి కదా! అందుకే శివుడు హంసగా దిగి వచ్చాడు. ఇక్కడ గుంటూరువారి సమన్వయం అతుకుతోంది.
హంసకు స్వర్ణత్వం ఎందుకు? ఈశ్వరుడు నీలలోహితుడు నలుపు, ఎరుపు కలిసినవాడు. అర్థనారీశ్వరుడు. ఈ రూపం సూర్యమండలం కంటే అధికమైన తేజస్సుగలది. తేజస్సుకు ప్రతిరూపం స్వర్ణం. అందుకే నల చరిత్రలోని హంస, స్వర్ణహంస!
ఇక నలదమయంతులు ఇద్దరూ సౌందర్యరాశులు మొదలైన విషయాలన్నీ కవులకు ప్రియమైన కథాసౌందర్యంకోసం వచ్చి చేరినవేనని పురంజనోపాఖ్యాన సూత్రంద్వారా మనం గ్రహించవచ్చు. కానీ, ఈ కథలో నలసౌందర్యానికి మరో ప్రయోజనం వుంది. దాన్ని బాహుకఘట్టంలో చెప్పుకుందాం.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి