మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటులనే సంసారియు వివేక వైరాగ్యములను రెక్కలతో మాయాజాలమును భేదించుకొని వెలువడగలడు.
556. దేవాలయమగు హృదయముయొక్క తాళము తీయవలయుననిన చెవి వెనుకకు త్రిప్పవలయును. అనగా భగవంతుని ప్రాపించుటకై (రాగద్వేషములను విడిచి) వివేక వైరాగ్యముల నవలంబింపవలయును.
557. వివేక వైరాగ్యములు లేనియెడల శాస్తమ్రులను వేదాంత గ్రంథములను ఊరక వల్లించుటచేనేమి ప్రయోజనము? అవి (వివేక వైరాగ్యములు) లేనిదే ఎట్టి ఆత్మవికాసమును గలుగజాలదు.
558. భగవంతుని ప్రాపించుటెట్లు? సిరిసంపదలను మనశ్శరీరములను అందులకై ధారపోయవలయును.
559. మోక్షమును బొందుటకుముందు లౌకికుని మనఃస్థితి యెటులుండవలయును? భగవదనుగ్రహమువలన భోజములయెడ అఖండ వైరాగ్యము కలిగిననేకాని కామినీ కాంచనముల ఆకర్షణనుండి నరుడు విముక్తిని బొందజాలడు. ఇక నీయఖండ వైరాగ్యమెట్టిది? ‘‘క్రమక్రమముగా భగవంతుని ప్రాపింతును’’- ఇది మందవైరాగ్యముయొక్క ధోరణి, కాని యెవని వైరాగ్యము తీవ్రమైయుండునో అట్టివాడు తల్లి బిడ్డకోసము పరితపించునట్లు భగవంతుని కొఱకై పరితపించును. భగవంతుని విడిచి యితరమునాతడు కోరడు. సంసారమాతనికి ఏ నిముసముననైనను తన్ను ముంచివేయు భయంకర సాగరముగా గాన్పించును. బందుగులాతనికి విష సర్పములుగా దోప వానిబారినుండి తప్పించుకొని పోజూచును. భగవంతుని సాక్షాత్కారము పొందుటకు ముందు సంసార పరిస్థితుల నాతడెన్నడును జక్కపెట్టుకొనదలపడు, సంసార స్పృహయే వానికి ఉండదు. తీవ్రమై రాగ్యమనగా ఇట్టిది, ముముక్షుత్వమనగా ఇట్టిది.
560. భగవంతునికొఱకై భక్తుడెందుచే సమస్తము త్యజించును? దివ్యమగు దీపమును జూచిన పిమ్మట మిడుత వెనుకకు మఱల నిచ్చగింపదు. చీమ పంచదార రాశిలో ప్రాణములు వడుచునే కాని వెనుకకు తిరుగడు. భగవద్భక్తుడును ఇట్లే తన ప్రాణములను సైతము బ్రహ్మప్రాప్తికై ధారపోయునేకాని అన్యమును లక్షింపడు.
561. పరిశీలనచే, ఆప్తవాక్యములచే, స్వానుభవముచే, పాకివాని స్థితినుండి సార్వభౌముని స్థితివఱకు గల సమస్త దశలను పరిశోధించి, విషయ భోగములు తుచ్ఛములని మనస్సునకు నిశ్చయము కలిగిననే కాని యెవ్వడును నిజమైన జ్ఞాని-పరమహంస- కానేరడు.
562. కామకాంచనములను త్యజించిననే కాని బ్రహ్మ జ్ఞాన మెన్నటికిని గలుగజాలదు. త్యాగోదయమైనంతనే అవిద్యాంధ కారము పటాపంచలగును. దుర్బినిని సూర్యకిరణములకెదురుగా బట్టుకొని తన్మూలమున ననేక వస్తువులను తగులబెట్టవచ్చును, కాని నీడనున్నగదిలో దానినట్లు వినియోగింపజాలము. మనస్సు విషయము కూడ నిట్టిదే. మనస్సను దుర్బినిని సంసారమను నంధకారమునుండి రుూవలకు దీసి స్వయం జ్యోతియగు పరమేశ్వరుని దివ్య తేజమును ఇదానిపై బడనీయవలయును. అపుడు త్యాగ వైరాగ్యము లుదయించును, అజ్ఞానము అంతరించును.
563. ఎట్టిగురుడైనను జ్ఞానము నొక్కుమ్మడి కలిగింపజాలడు. అందులకు కాలపరిపాకము కావలయును. తీవ్రమైన జ్వరము వచ్చినదనుకొము. అపుడు వైద్యుడు కొయినా (్ఖజశజశళ) ఈయగల్గునా? ఆ సమయమున దానివలన ప్రయోజనము ఉండదని వైద్యునకు తెలియును. అందుచే ఈయడు. జ్వఠముయొక్క వడి తగ్గవలయును. అందులకు కొంత కాలము పట్టును. పిమ్మట కొయినా గాని, మఱేమందు గాని ఈయనగును. జ్ఞానార్థుల విషయము కూడ నిట్టిదే.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి