మెయిన్ ఫీచర్

పరివర్తనకు మార్గం శిక్షణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరకు జ్యోతిషం, గ్రహదోషాలు వంటి వాటిని కూడా బాబా మూఢనమ్మకాలుగా భావించారు. తన భక్తులను వాటి జోలికి పోనివ్వలేదు. అందుకే యోగీశ్వరుల పరంపరలో సాయిబాబా విశిష్టమైన వారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మహిమలు ప్రదర్శించబోయినా వారిని వారించి దారిలోపెట్టారు. మహిమలకంటే మానవత్వాన్ని ప్రదర్శించటమే ఉత్తమమని బోధించేవారు. బాబా భక్తజన బాంధవుడు. భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం. బాబాకు దేహాభిమానం లేదు. కానీ, భక్తులను మనసారా ప్రేమించారు.
శిక్షతో కాదు.. శిక్షణ ద్వారా మనుషుల్లో పరివర్తన
బాబా మార్గం మిక్కిలి విశిష్టం. దుర్మార్గుల్ని దునుమాడటం, సజ్జనుల్ని రక్షించటం భగవంతుని అవతారాల కర్తవ్యం. అయితే సాయి దుర్మార్గుల్ని శిక్షించటంకాక శిక్షణ ద్వారా వారిని సజ్జనులుగా మార్చటానికి తన అవతార కాలాన్ని మొత్తం త్యాగం చేశారు. దుష్టబుద్ధుల్ని ఎలా దూరం చేసుకోవాలో సోదాహరణం చూపించారు. బాబా దృష్టిలో మంచి, చెడు అనేవి లేవు. మంచివాళ్లు, చెడ్డవాళ్లు అనే భేషజాలూ బాబాకు లేవు. అందరూ సమానమే. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీర్లు, సజ్జనులు, దుర్జనులు అందరినీ బాబా సమాదరించారు. భక్తుల కర్మ ధ్వంసం బాబాకోసం తన పుణ్యాన్నంతా ధారపోశారు. భవసాగరాన్ని హరించటంలో బాబా అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకట్లను చీల్చివేయటంలో సూర్యుని వంటివారు. ‘‘యోగులు తన ఆత్మ అని, వారి హృదయంలో తాను నివాసం ఉంటా’’నని శ్రీకృష్ణుడు భగవద్గీతలో, మహాభాగవతంలో సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పాడు. వాస్తవానికి భగవంతుడు, బాబా వేరుకాదు. బాబా హృదయం వాసుదేవ నిలయం. బాబా భక్తుల యోగక్షేమాలకోసం వారి హృదయాల్లోనే ఆవాసం ఏర్పర్చుకుని, కంటికి రెప్పలా చూసుకునే భగవంతుడు. సద్గురు శ్రేష్టుడైన బాబా జ్ఞానంలో ఉత్కృష్టుడు. దైవీ తేజస్సుతో ప్రకాశించేవారు. బాబా అభయహస్త వరద ముద్ర సర్వజగద్రక్ష.
బాబాకు ఇష్టం లేకుంటే ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయేవారు. తమవంతు రానిదే బాబాను దర్శించలేక పోయేవారు. కనీసం సాయి నామాన్ని సైతం స్మరించలేకపోయేవారు. చాలామంది బాబాను దర్శించుకోవాలనుకున్నారు. కానీ, బాబా మహాసమాధి చెందేవరకు వారికాఅవకాశం రాలేదు. పలువురు బాబాను దర్శించాలనే కోరిక గల వారు జీవిత కాలంలో తమ కోర్కెను తీర్చుకోలేకపోయారు. కొందరు అదృష్టవశాత్తూ బాబాను దర్శించుకున్నారు. కానీ బాబా సన్నిథిలో కొద్దిసేపు గడపాలనుకున్నా గడపలేకపోయేవారు. ఎవరూ తమ ఇష్టానుసారం షిర్డీ వెళ్లలేరు. వెళ్లినా, అక్కడ ఉండాలని ప్రయత్నించినా ఉండలేకపోయేవారు. బాబా ఆజ్ఞలేనిదే షిర్డీలో అడుగైనా పెట్టలేము. బాబా భక్తుల్లో కొందరిని షిర్డీలోనే ఉండమనేవారు. కొందరిని తక్షణం వెళ్లిపొమ్మనేవారు. బాబా మాటంటే మాటే! వెళ్లమంటే వెళ్లాలి. ఉండమంటే ఉండాలి. కాదూ కూడదని ఎవరైనా మొండికేసినా ఏదో ఆపద బారిన పడేవారు. అసలు తన భక్తులు ఏ ఆపదల బారినపడకుండా ఉండేందుకే బాబా సమయానుకూలంగా భక్తులను షిర్డీ విడిచి వెళ్లమనటం కాని, ఉండమనటం కాని చేసేవారు. సర్వమూ బాబా ఇష్టానుసారమే జరిగేది.

మాయ నన్నునూ బాధించుచున్నది..
బాబా రూపం సంతోషదాయకం. నిర్మలత్వానికి ప్రతీక. శాంతికి పెన్నిథి. బాబా మాటలు క్లుప్తం, భావగర్భితం. అర్థపూర్ణం, శక్తిమంతం. సమతూకం.
‘‘నేను ఫకీరును. నాకు ఇల్లు, వాకిలి లేవు. భార్యాపిల్లలు లేరు. బాధరబందీ లేవీ లేకున్నా, కదలక ఒకచోటే కూర్చునిఉన్నా తప్పించుకొనలేని మాయ నన్నూ బాధించుచున్నది. నేను నన్ను మరిచిననూ నన్ను ఆమె (మాయ) మరువలేకున్నది. ఎల్లప్పుడూ మాయ నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకుపర్చుచుండగా, నావంటి దుర్భలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనపుడే ఆ మాయనుంచి తప్పించుకొనుట సాధ్యం. నిరంతరం హరి నామస్మరణే దానికి మార్గం.’’
భాగవతంలో ఉద్ధవునితో శ్రీకృష్ణుడు- ‘‘యో గులు నా సజీవ ప్రతి రూపాలు’’అని అంటాడు. మరి బాబా తన భక్తులకు ఏం చెబుతున్నారో చూడండి!
‘‘ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించాయో వారే నన్ను సదా జ్ఞప్తియందుంచుకొని, సర్వకాల సర్వావస్థలా నాయందు తత్పరులై గడపగలరు. ఎల్లప్పుడు ‘సాయి సాయి’అని స్మరించువారిని సప్త సముద్రాలు దాటిస్తాను. ఈ మాటల్ని విశ్వసించండి. తప్పక మేలు పొందుతారు. నాకు పూజాతంతులతో పనిలేదు. షోడశోపచారములు, అష్ఠాంగ యోగములు నాకు అవసరంలేదు. భక్తి ఉన్నచోటే నా నివాసం. భక్తినిండిన మీ హృదయంలో చోటివ్వండి. నేనక్కడ శాశ్వతంగా కొలువుండిపోతాను.’’ ముక్తికి, మోక్షానికి భగవంతుడు భక్తులకిచ్చే వాగ్దానాలలో, సులభోపాయాల్లో ఇంతకంటే అద్భుతమైన వాగ్ధానం మరొకటి ఉండదుగాక ఉండదు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566