ఉత్తరాయణం

చరిత్ర వక్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కంచెలో కన్నాల’ గురించిన సంపాదకీయం బాగుంది. బ్రిటిష్‌వారు కుటిలనీతిని ప్రయోగించి, చరి త్రను వక్రీకరించి దేశాన్ని ద్వేషించడమే నాగరికత అన్న స్థాయలో కానె్వంట్లలో పాఠాలు చెప్పించారు. అందువల్ల ప్రజలకు దేశభక్తి పనికిరాని పదార్థమైపోయం ది. అయ్యర్ లాంటి వారు పాక్‌కు వెళ్లి మోదీని దించేస్తే కాని శాంతి చర్చలు జరుగవని ప్రకటించడం దారుణం. మరో దేశంలో అయతే దేశద్రోహం కింద అయ్యర్‌ను జైల్లో పెట్టి ఉండేవారు.
- లక్ష్మీ ప్రసన్న, పేర్రాజుపేట, తూర్పుగోదావరి జిల్లా
నీతులు చెప్పడానికేనా?
‘‘ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న అనైతికత’’ పేరిట ముదిగొండవారు రాసిన వ్యాసం ఆలోచనాత్మకంగా ఉన్నది. ఆ రుగ్మతలన్నీ ప్రజా ప్రతినిధులకూ తెలుసు. కాని వాటిని సవరించడానికి పూనుకోరు. ఎందుకంటే ఆ సవరణలు తమకే ముప్పుగా పరిణమిస్తాయ కనుక. అయతే ముదిగొండవారు మరొక్క విషయం చెప్పి ఉంటే బాగుండేది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి అత్యున్నత స్థానంలో ఉన్నవారు సుద్దులు, ఉపన్యాసా లతో కాలక్షేపం చేస్తున్నారు కాని, రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవడం లేదు. పార్లమెంటుని సాగనివ్వం అని హెచ్చరించి మరీ అడ్డుకుంటున్న వారిని మందలించి పార్లమెంటులో చర్చలు సాగేట్టు చేసే బాధ్యతను రాజ్యాగం పరిరక్షకులు విస్మరిస్తున్నారు. ఎందుకని?
- శాంతి చంద్రిక, సామర్లకోట
తెలుగువారిది దృఢమైన బంధం
కెసిఆర్ వారసుడు కెటిఆర్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్రాలు విడిపోయనా తెలుగువారి మధ్య బంధం వీడలేదన్నది ఈ ప్రకటనతో స్పష్టమైంది. కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చంద్రబాబు హాజరు కావడం శుభసూచికం. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలు అందరూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవారే కదా. కృష్ణ, చిరంజీవి, దివంగత ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు వంటి వారిని తెలుగువారు తమ గుండెల్లో పెట్టుకొని అభిమానించడం లేదా? రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పరస్పరం పోటీపడి, తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను దిగంతాలకు చేర్చాలి.
-కొలిపాక శ్రీనివాస కృష్ణ, బెల్లంపల్లి
పల్లెలను అణగదొక్కవద్దు
ఏ ప్రభుత్వం వచ్చినా పల్లెలను అణగదొక్కి, పట్టణాలను పెంపొందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. గాంధీని ఆదర్శంగా తీసుకున్నామంటారు. గాంధీ చెప్పిన ‘గ్రామ స్వపరిపాలన’ మాటే ఎత్తరు. గ్రామాల్లో గుంటల మట్టిరోడ్లు అలాగే ఉన్నాయ. కానీ అర్జెంటుగా బుల్లెట్ రైళ్లు అవసరమయ్యాయా? భూగర్భజలం ఇప్పటికే ఇంకిపోయందని తెలిసి కూడా న్యూయార్క్, సింగపూర్ టైపులో వంద అంతస్తుల భవనాలను నిర్మిస్తాము అని చెప్పడం గ్రామ ప్రజలను అవహేళన చేయడమే. పట్టణాల్లో కూడా తిండి దొరకని పరిస్థితి ఉండబట్టే కదా రాయలసీమ నుంచి ఆరులక్షల మంది కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలసపోయంది. తెలంగాణలో కూడా పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయ. చద్ది అన్నం మూట గట్టుకొని మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, బిహార్‌లకు కూడా రోజూ సాగే, పెరుగుతూ ఉండే చీమ ల బారుల్లాంటి వలస జనాలను చూస్తుంటే గుండెలు ఎవరో పిండుతున్నంతటి బాధ. వ్యవసాయ భూమి నంతా భవనాలకూ, సెజ్‌లకూ, బడా పరిశ్రమలకూ, దత్తం చేస్తే పట్టణాల్లో జనం మాత్రం ఏం తింటారు? మానవత పొంగిపొర్లే ‘వైరుధ్య ప్రగతి’ వంటి మీ సంపాదకీయాలు ఇట్లాగే కొనసాగాలి.
- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
వికలాంగులకు అన్యాయం
డి.ఎస్.సి-2002 (అన్‌ట్రైయిన్డ్) క్వాలిఫైడ్‌కి తీరని అన్యాయం జరిగింది. క్వాలిఫైడ్ అయినప్పటికీ, బిసిలకు, వికలాంగులకు మొండి చేయి మిగిలింది. నిరుద్యోగ వికలాంగులకు కేటాయించబడిన ఉపాధ్యాయ పోస్టులను ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్స్‌తో నింపివేసి, అన్‌ట్రైయిన్డ్ క్వాలిఫైడ్స్‌కి విదిలించి వేశారు.