లోకాభిరామం

ఔర్ చల్‌తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను అయిదవ అంతస్తు అనే ఆకాశంలో నుంచి నేల మీదకు దిగి నడుస్తున్నాడు. మరీ ఎక్కువ దూరం నడిచినట్లేమీ లేదు. పార్కులో పెద్ద మనుషుల చర్చ వినిపించదు గానీ కనిపిస్తుంది. వాళ్లు కొంపలు ములిగితే కాపాడుతున్నాము అన్నంత సీరియస్‌గా మాట్లాడుతుంటారు. పార్కులో చుట్టూ ఒక బాట వేశారు. అది వాకర్స్ ట్రాక్. అంటే నడవదలచుకున్న వారికొరకన్న మాట. నిజంగానే లావాటి వాళ్లు, బక్కపలుచని వాళ్లు కొంతమంది అందులో అదే పనిగా నడుస్తున్నారు. తాను కూడా నడిస్తే, అంటే, వాళ్ల మధ్యన, వాళ్లతోబాటు.. నడిస్తే బాగుంటుంది అనుకుంటాడు అతను. కానీ, ఎందుకో నడవడు. నడుస్తున్న వాళ్లలో అన్ని రకాల వాళ్లు ఉన్నారు. ఒకరెవరో మరీ వేగంగా నడుస్తూ, అందరినీ ఓవర్‌టేక్ చేస్తూ ముందుకు వెళ్లిపోతున్నారు. అది అతనికి నచ్చలేదు. కానీ, ఏం చేయగలడు? ఇలాంటి చికాకులు ఉంటాయనే బహుశః అతను పార్కులోని ట్రాక్‌లో నడవడం లేదేమో?
ఏం ఆలోచిస్తున్నాడో తెలియదుగానీ, అతను తల కిందకు వేసుకుని ముందుకు సాగుతున్నాడు. అతనికి ఈ ప్రపంచం నచ్చినట్టు లేదు. అట్లాగని ఆ ముఖంలో నిరుత్సాహం మాత్రం లేదు. అంతలో అక్కడ ఒక చౌరస్తా, చౌరాస్తా, అను నాలుగు దారులు కూడలి వచ్చింది. అక్కడ అటూ ఇటూ బండ్లు, అంటే నాలుగు సైకిలు చక్రాల మీద చెక్కపరిచిన తోపుడు బండ్లు ఉంటాయి. వాటి మీద పండ్లు అమ్ముతూ ఉంటారు. అన్ని రకాల పండ్లు కనబడుతుంటాయి. అతనికి కొనాలనే ఉంటుంది. కానీ, ఎన్నడూ కొన్నట్లు కనబడలేదు. ఒకప్పుడు మాత్రం అక్కడ, అతనికి, చిత్రమయిన ఒక నేస్తం కాని నేస్తం ఉండేవాడు. అతనెప్పుడూ జామపళ్లు మాత్రమే అమ్మేవాడు. వయసు ప్రకారం అతనికన్నా ఆ జామపండతను పెద్దవాడు. చాలా పెద్దవాడు. నిజానికి అట్లా బండి మీద పండ్లు అమ్మవలసిన వయసు ఎప్పుడో మించిపోయింది. ఆ మాటే తోచిందేమో అతను ఒకప్పుడు ఆ ముసలతనితో మాట కలిపి అడిగాడు. జవాబుగా వచ్చిన మాటలు అతనికి చాలా నచ్చాయి. ఆ ముసలతను తనకు ఒక పెద్ద ఇల్లు ఉందన్నాడు. అందులోని పోర్షన్‌లను కిరాయిలకు ఇచ్చాడు. ఇరవయి అయిదు వేలకు పైన, ఆ కిరాయిలే నెలనెలా అందుతాయి. కనక, కాలు మీద కాలు వేసుకుని తినవచ్చునన్నాడు. కానీ, అట్లా కూచోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదన్నాడు. ‘బండితోని వస్త. ఈడవెట్టి గోడ పక్కన కూకుంట. అరిశెడిది అవుసరము లేదు. మీ అసుంటి అయ్యలు వస్తరు. మాల్ బాగుంటే కొంటరు. మాట, పలుకు నడుస్తది. టైం పాస్ అయితది. బేరం కూడ అయితది. పొద్దుమూకి ఇంటికి వోత! ఇంటికాడ కూశుంటే ఏమొస్తది సార్! మీరె జెప్పుండి’ అని అతగాడు ఒక చిన్న లెక్చర్ ఇచ్చాడు. అతను మనసులోనే చాలా ఉప్పొంగిపోయాడు. ఆ తరువాత అప్పుడప్పుడు జామపండ్లు కొనేవాడు. ఎంత అని అడిగేవాడు కాదు. తీసుకున్న తరువాత ‘ఎంత యివ్వాలి’ అంటాడు. అడిగినంత యిస్తాడు. ముసలతను ఆ తరువాత ఒక పండు అతని చేతికి ఇస్తాడు. ‘అయ్యను జూస్తే ఒక పండు యియ్యాలని అనిపిస్తది’ అన్నాడు ఒకసారి. అదొక రకం దోస్తీ. అంతగా మాటలు లేని దోస్తీ!
అసలు సంగతి ఏమిటంటే, బండి ఉంది. జామపళ్లు, కాయలు ఉన్నాయి. ముసలతను మాత్రం లేడు. మరెవరో కుర్రాళ్లు అమ్మకం సాగిస్తున్నారు. అతను ఎందుకో మరి వాళ్లతో మాట్లాడలేదు. ముసలతని గురించి అడగనూ లేదు. బండి మీద సరుకును కొనడం అంతకన్నా లేదు.
అతను నడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. కుడికి మళ్లి ముందుకు సాగితే, అతనివాళ కొంచెం ఎక్కువ దూరం నడుస్తాడని అర్థం. కానీ అతను మళ్లలేదు. ముందుకు నేరుగా నడక సాగింది. అంటే చిన్న రౌండుతోనే సాయంత్రం ముగుస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి పనికీ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఛాయిస్‌లు ఉంటాయి. అది మనుషులకేనా, అన్ని జంతువులకూ ఉంటాయా?
అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అలాగూ చేయవచ్చనుకో అనడానికి, మరో పరిస్థితి ఉందని మనిషికి మాత్రమే తెలుసునేమో? మనుషులు మాత్రం, అందరూ అవకాశాలను గుర్తిస్తున్నారా? అలవాటుగా చేస్తున్న పనినే ఆలోచన లేకుండా చేస్తూ పోతున్నారా? నడవాలంటే ఇటు వేపే రావాలా? నిజానికి మరి కొంచెం పోతే పెద్ద రోడ్ వస్తుంది. దుమ్ము, ధూళితోపాటు, చంపుతాం అంటూ వచ్చే వాహనాలు తరుముతాయి. ఎందుకొచ్చిన నడక? ప్రశాంతంగా నడవడానికి తగిన ప్రదేశం ఎక్కడయినా ఉందా? ఉండకపోతుందా? అతను ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు.
ఆరోగ్యం, వ్యాయామం కొరకు నడకయితే, నోరు మూసుకుని, ఒక రకమయిన వేగాన్ని స్థిరం చేసి, లయబద్ధంగా ఊపిరి తీస్తూ, చేతులు బాగ ఆడిస్తూ నడవాలి. అతను కేవలం కాలక్షేపం కొరకు మాత్రమే నడుస్తున్నాడు అనిపిస్తుంది. మరీ కదలకుండా ఇంట్లో కూచుంటే కీళ్లు పట్టుకుపోతాయి.
అంతలో అతనికి ఏదో ఆసక్తికరంగా కనిపించినట్లుంది. తల ముందుకు, కిందకు వాల్చి నడుస్తున్న వాడల్లా ఆ పక్కకు పరీక్షగా చూస్తున్నాడు. అక్కడొక గుడి ఉంది. గుడికి అరుగు కూడా ఉంది. అక్కడ కొంతమంది మవునంగా, కొంతమంది మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. అతను, వాళ్లల్లో ఎవరి కొరకో వెతుకుతున్నాడు. నిజమే, అక్కడ తరచు పండులాగుండే ఒక పెద్దాయనతో అతను మాట్లాడుతుంటాడు. ఒకవేళ పరధ్యానంగా ముందుకు సాగినా, ఆ పండు కేకవేసి మరీ పలుకరిస్తాడు. తనకన్నా పెద్ద మనిషికి అంత కష్టం కలిగించకూడదని అతని ప్రయాస! కానీ, అతను వెతుకుతున్న ఆ పెద్ద మనిషి ఇవాళ కూడా కనిపించలేదు. పెద్దవాళ్లు కనిపించడం లేదంటే, ఆరోగ్య సమస్య అయి ఉండాలి. లేదంటే.. అయ్యో! పాపము శమించుగాక!
ఆ పెద్దాయన నిజంగా పండులాగ ఉంటాడు. అందగాడు. హాయిగా నవ్వుతాడు. ఒకే అమ్మాయి అదేదో దేశంలో పెద్ద సైంటిస్టుగా పని చేస్తుంది. కానీ ఏం లాభం? ఈయన ఒంటరి. కానీ, ఏనాడూ ఆ ముఖంలో అటువంటి భావం కనిపించదు. హాయిగా అందరితో మాట్లాడుతూ సరదాగా కనబడతాడు. ఆయనతో అంతకు మించి ఎక్కువ పరిచయం లేనే లేదు. కనీసం పేరు కూడా గుర్తులేదు. అయినా ఆ మనిషి కనిపించకపోతే, ఏదో వెలితి. కనిపించిన వాళ్లను అడగవచ్చు గదా? ఏమని అడగాలి? పేరు కూడా తెలియందే? నిజానికి అడిగి ఉండాలి. అతని స్వభావం అటువంటిదే. అందరితో మాటలు కలిపి అనవసరం అనుకున్న చోట కూడా మాట్లాడతాడు. కానీ ఇక్కడ మవునం! ఏం వినవలసి వస్తుందోనన్న అనుమానమేమో?
అతను కూడా సీనియర్ సిటిజన్‌లలో చేరినవాడే. కానీ, అతనికి, చిన్నతనం నుంచి పెద్ద వయసు వాళ్లంటే, ఒక రకమయిన గౌరవం. వెతికి సంపాదించి ఒక ముసలి మొహం బొమ్మను ఒక పుస్తకం మీద అంటించాడు. అది హైస్కూల్లో ఉండగా! ఎవరో అడిగారు, అదేం ఛాయిస్ అని! ఏదో ఒకనాడు మనం కూడా ఇలాగే పెద్దవాళ్లం అయిపోతాం గదా?’ అంటూ ఏదో చెప్పాడతను.
నిశ్శబ్దంగా తిరుగుతూనే అతను ఆ ప్రాంతంలో కనిపించే తనకన్నా పెద్ద వయసు వాళ్లను కొంత మందిని లెక్కించుకున్నాడు. వాళ్లలో ఒకరిద్దరు ఈ మధ్యన కనిపించడం లేదు. వాళ్లలో కొందరు మిఠాయి అంగడిలో, మిరపకాయ బజ్జీ బండ్ల దగ్గర కనిపించేవారు. తనలాగే తిండీ యావ మనుషులేమో? ఇంట్లో వాళ్లు ఆరోగ్యం అంటూ ఏదీ తిననివ్వరు. అందుకే వాళ్లు చిరుతిండ్లు తింటారు. తాను మాత్రం, బయట తిండి తినగూడదని గట్టి నిర్ణయంగల మనిషి.
పెద్దవాళ్లను గురించి ఆలోచన సాగుతుండగానే, అతను మెయిన్‌రోడ్ వరకూ నడిచాడు. అక్కడ మరో ముసలతను గుర్తుకు వచ్చాడు. అతను కురచగా, పీలగా ఉంటాడు. పది సైజుల ఎక్కువగల చొక్కా, లాగూ వేసుకుని ఉంటాడు. అనుమానం లేదు, అతను బిచ్చగాడు. అయినా, ఈ సమయంలో అతడు అక్కడే ఉండే, బార్ నుంచి వస్తుంటాడు. జేబులో సీసా ఉండి తీరుతుంది. ఇవాళ అతనింకా కనిపించలేదు. వెతుకుతూనే అతను ముందుకు సాగుతున్నాడు.
*

కె. బి. గోపాలం