ఉత్తరాయణం

కుహనా సెక్యులరిస్టులకు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 18వ తేదీనాటి ఎడిటోరియల్ ఉన్నతం. హిం దూమతాన్ని వ్యతిరేకించే కుహనా రాజకీయ నాయ కులకు, కమ్యూనిస్టులకు, సెక్యులర్ వాదులుగా తమను చిత్రీకరించుకుంటూ హిందూమతం మాకు వద్దు-కులం మాత్రం మాకు ముద్దు అనే గోముఖ వ్యాఘ్రాలకి నిజంగా ఇది చెంపపెట్టు. కమ్యూనిస్టులు రహస్యంగా హిందూ దేవతల్ని ఆరాధించడం మాని బహిరంగంగా హిందూ వాదులైతే ప్రజలకు అభ్యంతరం ఉండదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం

వంశపారంపర్య రాజకీయాలు
చాలాకాలం క్రితం అంటే 1974లో నాటి ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుష్వంత్ సింగ్ ఇలా రాశారు ‘‘సంజయ్‌గాంధీ ప్రాదుర్భావంతో దేశంలోని యువత ఆశయాలు ఆకాంక్షలు నెరవేరుతాయి.’’ తర్వాతి కాలంలో ‘కుమారులను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడం’ ప్రారంభం కావడంతో ఆయన పరిశీలన నిజమని తేలింది. జవహర్‌లాల్ నెహ్రూ వంశపారంపర్యతను ప్రవేశపెట్టారు. అది క్రమంగా పాతుకొని పోయి నేడు ఈ కుటుంబానికి చెందినవారికి మాత్రమే దేశాన్ని పాలించే హక్కు ఉన్నదనే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వీరు చట్టానికి అతీతులన్న భావం కూడా బలీయమైపోయింది. ఇందిరాగాంధీ ఈ విషయంలో మరింత ముందడుగు వేసి ప్రధానిగా తనను చట్టపరిధినుంచి మినహాయించే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టేవరకు వెళ్లారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్ వరకు వంశానుక్రమణిక కొనసాగగా, ప్రియాంక, వాద్రాలు ఇంకా వేచివుండే దశలో కొనసాగుతున్నారు. ఇక దేశంలో ఇతర ‘రాజకీయ’ వంశాలను పరిశీలిస్తే...ములాయం సింగ్ యాదవ్-కుమారుడు అఖిలేష్ యాదవ్, లలూప్రసాద్ యాదవ్-కుమారుడు తేజస్వీ యాదవ్ (26ఏళ్లవయసు), జగన్ మోహన్ రెడ్డి-వైఎస్‌ఆర్ కుమారుడు, లోకేశ్ నాయుడు- చంద్రబాబు నాయుడు కుమారుడు, శరద్‌పవార్-కుమార్తె సుప్రియా సోలి, కరుణానిధి- కుమార్తె కనిమోళి, ప్రకాశ్ సింగ్ బాదల్-కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, షేక్ అబ్దుల్లా-కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, మనుమడు ఒమర్ అబ్దుల్లా, తరుణ్ గొగోయ్-కుమారుడు గౌరవ్ గొగోయ్ (అస్సాం). ఇక వారసులు లేని వారి విషయానికి వస్తే..జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, ప్రధాని నరేంద్ర మోదీ.
పై అంశాలను పరిశీలిస్తే భారత రాజకీయాలు ఫ్యూడలిజం వైపుకు వెనక్కు మరలాయని చెప్పాలి. అంటే అధికారంలోకి వచ్చే తర్వాతి తరం వ్యక్తి తన పై తరాల సంప్రదాయాన్ని కాపాడుతుంటాడు. ఇదే ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యవహారం. రాజకీయ పార్టీలు కొందరు నేతల కుటుంబ ఆస్తిగా మారిపోయాయి. ఇక మంత్రివర్గ సభ్యులు ‘జీ హుజూర్’ అంటూ సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి వద్దకు ఫైళ్లను పంపడం ఆనవాయితీగా మారింది.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

నేర చరితులతో భ్రష్టుపడుతున్న రాజకీయాలు
నేర చరితులతో పాప పంకిలవౌతున్న దేశ రాజకీయాలను ప్రక్షాళన చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి దశాబ్దకాలం దాటింది. ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల సంస్కరణ దిశగా ఎన్నో అడుగులు వేసింది. అయితే అధికారం, కండబలం, ధనబలం చెట్టాపట్టాలేసుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఆ ప్రయత్నాలకు మూకుమ్మడిగా గండికొట్టాయి. తాజాగా బిహార్ ఎన్నికలలో 140 మంది నేరచరితులు ఎన్నిక కావడం ప్రస్తుత దుస్థితికి దర్పణం. ప్రజాసంక్షేమంకోసం కృషిచేయడానికి నిర్దేశించిన ప్రజాప్రతినిధులతో హత్య, మానభంగం, మతకలహాలు సృష్టించడం, అవినీతి, దొమీ వంటి తీవ్ర ఆరోపణలు అభియోగం కావడం, దాదాపుగా 70 మందిపై ఆరోపణలు ఖరారు అయ్యి, కోర్టులు త్వరలోనే తీర్పులు వెలువరించడం చూస్తుంటే నేరచరితులు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎంతగా పట్టుబిగించాలో అర్ధవౌతుంది. విచిత్రమేమిటంటే ప్రజలకు నీతిబోధలు చేసే పార్టీలన్నీ నేరచరిత్ర వున్నవారికే టిక్కెట్లు యిచ్చి ఎన్నికల బరిలోకి దించడం. దేశ రాజకీయాలను భ్రష్టుపట్టించడంలో రాజకీయ పార్టీలన్నీ ఒక తానులోని ముక్కలమని రుజువు చేసుకున్నాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

గోవధ నిషేధం
రాజ్యాంగ అధీకరణ 48 ప్రకారం గోవు- వీటి సంతతిని సంహరించకూడదన్నప్పుడు గోవధ నిషేధ చట్టం మళ్ళీ ప్రత్యేకంగా రాష్ట్రాలు చేయవలసిన అవసరమేమొచ్చింది? మన పురాణాల కథనం తెలియజేసినదేమంటే ఒక్క గోవుమాత్రం బ్రహ్మసృష్టికాదు. అది యజ్ఞం చేయ గా యజ్ఞకుండం నుండి ఉద్భవించిందిట. గోవు ద్వారా లభించే పంచగవ్యాలు పరవౌషధాలని శాస్తజ్ఞ్రులే నిరూపించారు. అందుకే అది పరమపవిత్ర గోమాతగా అనాదినుండి కీర్తింపబడుతోంది. గోవు ఒక జంతువు, దానికో మతం లేదు. కాని హిందువుల ఆరాధ్యదైవమయింది. హిందువుల విశ్వాసాలకు విరుద్ధంగా ప్రవర్తించడం కొందరి ధ్యేయం. అందులో హిందువులూ ఉండడం విడ్డూరం.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

దేవతల చిత్రాలను ముద్రించరాదు
కాలేజీ బుక్స్‌పైన నోట్‌బుక్స్‌పైన అలాగే వేసుకునే దుస్తులు పైన, పటాసులపైన టోటల్‌గా ఏ వస్తువుపైన దేవుళ్ళ, దేవతల మూర్తుల ముద్రణ వేయడం బావుండలేదు. కారణం అవి రోడ్డుమీద పారేస్తున్నారు. అవి చూడకుండా నడిచే వారికి చూసుకోకుండా అడుగులు పడి త్రొక్కడం వలన పాపం చేసినవాళ్ళమవుతాం. కాబట్టి వీటిని నిషేధించి వాటి స్థానంలో పక్షుల, సీనరీలు, జంతువుల ఇతరాలు వగైరా ముద్రిస్తే అందరికీ ఆరోగ్యదాయకం.
- చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్