ఉత్తరాయణం

అతి అన్నివేళలా మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి సర్వత్రా వర్జయేత్ అనేది పెద్దల సూక్తి. కాని నేటి మన రాజకీయ నేతలు శృతి చేయడంలో మొనగాళ్లు. పదవి లేనిదే బతుకు లేదనే స్థాయకి కొందరు నేతలు దిగజారారు. కడుపు నిండిన అమ్మ, కుక్కల పెళ్లి చేసిందన్న సామెతలా ప్రజాసమస్యలను గాలికి వదిలి కొత్త చిక్కులు తెస్తున్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య వంటి పెద్దలు. అవసరం అనుకుంటే బీఫ్ ఫెస్టివల్ మేళాలు నిర్వహించి గొడ్డుమాంసం తింటాడట. గోవధపై కూడా అనవసర రగడ. కొందరు హిందువులు భావిస్తున్నట్టు గోవు పవిత్రమైనది కాకపోయనా ప్రయో జనకారియే. ఆవుపాలు ఆరోగ్యానికి మంచిదని, గో మూత్రం వైద్యానికి, ఆవుపేడ పంటపొలాలకు ఉప యోగకరం. కానీ మైనారిటీల ఓట్ల కోసం లౌకిక వాదం పేరుతో అభద్రతా భావం పెంచుతున్నారు.ఐతే వారు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యవంతులై కుటుంబ నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు.
తాజాగా సిద్దరామయ్యగారి మరో రెచ్చగొట్టే చర్య టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహిం చడం. టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో హిందువులను వేధించలేదనుకున్నా, ఇతర రాజ్యాలపై దాడులు చేసినప్పుడు నరమేధం సృష్టించినట్లు చారిత్రిక వివాదాలు న్నాయ. ఈ వివాదాల మధ్య టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనవసర ఉద్రిక్తతలను పెంచేది తప్ప మరోటి కాదు. అంతగా తమకిష్టమైతే సొంత సొమ్ముతోనో, పార్టీ పరంగానో నిర్వహించుకుంటే బా గుండేది. ఇకనైనా తక్షణ ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తే మంచిది.
- తిరుమల శెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

వ్యవసాయంలో విప్లవం రావాలి
వ్యవసాయంలో రైతులు విపరీతంగా వాడుతున్న రసాయనిక ఎరువుల వలన నష్టమే ఎక్కువ. దీనిని రైతులు ఇంకా గమనించడం లేదు. సహజసిద్ధమైన సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే రైతులకు, ప్రజలకు అమితమేలు జరుగుతుంది. రుచికి రుచి పంట దిగుబడి పెరగడం వంటి ఉత్తమ గుణాలున్న సహజ ఎరువులను వాడాలి. వ్యవసాయం చేయడానికి చదువుకున్న గ్రామీణ యువత ముందుకు రావాలి. సహజ ఎరువులని (సేంద్రియ) పదార్థాలైన ఆవుమూత్రము, ఆవుపేడ, గేదెల పేడ, మేక గొర్రె ఎరువులు, వేప లాంట వాటి కషాయాలు ఆకలు పంట పొలాలకు వినియోగిస్తే ఆరోగ్యానికి తిరుగులేదు. కనుక అన్నం పెట్టే రైతన్న ఈ విషయంలో ముందడుగు వేస్తూ తన తోటి రైతులను కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్

నేపాలీలను ఆదుకోవాలి
చాలా కాలం నుండి నేపాల్ నుండి వచ్చిన వారు హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర పట్టణాలలో, నగరాల్లో (రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ) నివసిస్తూ చిన్నాచితకా పనులు చేసుకుంటూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన ముస్లింల గురించి శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వాల నేపాలీ హిందువులన్న కారణంగా పట్టించుకోవడం లేదు. ఏలిన వారి సెక్యులరిజం ‘బహు చక్కగా వర్ధిల్లుతోంది’. ఇకనైనా రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు నేపాలీల స్థితిగతుల పట్ల శ్రద్ధ వహించి తగురీతిగా సహాయక చర్యలు చేపట్టాలి.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్