క్రైమ్/లీగల్

కలెక్టరేట్ మేడపై నుంచి దూకి మహిళా ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 18:ఓ మహిళా ఉద్యోగి ఏకంగా కలెక్టరేట్ మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. కలెక్టరేట్‌లో శుక్రవారం డీఆర్‌సీ సమావేశం ఉండటంతో ఆళ్లగడ్డలో స్ర్తి శిశు సంక్షేమశాఖలో(ఐసీడీఎస్) సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న శోభారాణి కర్నూలుకు వచ్చారు. సమావేశం జరుగుతుండగానే ఆమె కలెక్టరేట్ మేడపైకి వెళ్లి ఉదయం 11గంటల ప్రాంతంలో కలెక్టర్ బంగ్లా వైపు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం ఇవ్వడంతో కర్నూలు 3వ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు వైద్య కళాశాలకు తరలించారు. ఇదిలా ఉండగా శోభారాణి ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారమని బంధువులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ర్యాలీకి శోభారాణి హాజరు కాకపోవడంతో ఐసీడీఎస్ పీడీ సీడీపీఓ ద్వారా ఆమెకు మెమో జారీ చేసినట్లు సమాచారం. దీనికి తోడు తరచూ ఆమెకు మెమోలు జారీ చేస్తూ వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్థాపం చెంది శోభారాణి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు వాపోతున్నారు. ఆళ్లగడ్డ మండలం బత్తులూరులో శోభరాణి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శోభారాణి ఆత్మహత్యపై కలెక్టర్ సత్యనారాయణ స్పందించి వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాని కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్‌ను ఆదేశించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోని బోరున విలపించారు. కాగా శోభారాణి భర్త ఫిర్యాదు మేరకు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి మృతి
క్రిష్ణగిరి, మే 18:పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. డోన్ పట్టణంలోని ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన గిడ్డయ్య కుమారుడు ఎరుకలి గిరిబాబు(19)కు మతిస్థిమితం సరిగా లేదు. దీంతో ఈ నెల 16వ తేదీ మండల పరిధిలోని చిట్యాల గ్రామానికి చెందిన ఖాజాహుసేన్ చీనీతోటలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. ఇది గమనించి గిరిబాబు సోదరుడు గిడ్డయ్య అతడిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ హరినాథ్‌సింగ్ తెలిపారు.