క్రైమ్/లీగల్

వాగులో పడి యువకుడి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, మార్చి 21: మండల పరిధిలోని జన్నారం గ్రామ సమీపంలో వాగులో పడి యువకుడు గల్లంతైన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జన్నారం పంచాయతీలోని కోనాయపాలెం గ్రామానికి చెందిన పామర్తి విజయ్ (19) తోపాటు మరో ముగ్గురు యువకులు కలిసి బహిర్భూమికి అని సమీపంలోని వాగువద్దకు వెళ్లారు. దీంతో వాగులో దిగి ప్రమాదవశాత్తు కాలుజారి విజయ్ వాగులో కొట్టుకొని పోయాడు. ఆసమయంలో పక్కనే ఉన్న యువకులు అతనిని కాపాడే ప్రయత్నం చేసినప్పటకి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో పడి గల్లంతైపోయాడు. పక్కనే ఉన్న యువకులు కేకలు వేయటంతో సమీపంలోని పొలాల్లో ఉన్న గ్రామస్తులు వచ్చి యువకున్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతుడు విజయ్ ఖమ్మం ప్రైవేట్ కళాశాలలోఇటీవల ఇంటర్ మీడియట్ పూర్తి చేసాడు. మృతునికి తల్లి లక్ష్మి, తండ్రి శ్రీను, తమ్ముడు ప్రేమ్‌కుమార్ ఉన్నారు. చేతి కొచ్చిన కుమారుడు మృతి చందాడని వాగు వద్ద తల్లి తండ్రి రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. సంఘటనా స్థలానికి ఏన్కూరు ఎస్‌ఐ నాగరాజు వెళ్లి వివరాలు సేకరించారు.