క్రైమ్/లీగల్

ఫంక్షన్‌హాల్స్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), మార్చి 21: ఖమ్మంలో ఫంక్షన్‌హాల్స్ నిర్వహిస్తున్న యజమానులు ఆయా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఏసిపి సదానిరంజన్ అన్నారు. బుధవారం ప్రకాశ్‌నగర్‌లోని కమాండ్ కంట్రోల్ ట్రాఫిక్ కౌన్సిల్ సెంటర్‌నందు ఫంక్షన్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫంక్షన్‌హాల్స్ నందు తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలం లేని ఫంక్షన్‌హాల్స్ పర్మిషన్‌ను మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు రద్దు చేస్తామన్నారు. ఫంక్షన్‌హాల్స్ ముందు ప్రైవేటు సెక్యురిటిని నియమించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఫంక్షన్‌హాల్స్‌కు వచ్చే వాహనాలు రోడ్లపై నిలిపితే వాటికి వీల్‌లాక్‌లు వేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, ఫంక్షన్‌హాల్ యజమానులు పాల్గొన్నారు.