క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, మార్చి 1: మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు సింగరేణి కాలరీస్ కంపెనీలో ఫ్లంబర్‌గా ఉద్యోగం చేస్తున్న కుడిపూడి నాగేశ్వరరావు(55), అతని భార్య మంగలక్ష్మి(50) మణుగూరులో నివాసం ఉంటున్నారు. నాగేశ్వరరావు సహోదరుడు వెంకటేశ్వర్లు, అతని భార్య లక్ష్మి పశ్చిమగోదావరి జిల్లా అమలాపురంలో ఉంటున్నాడు. రెండురోజుల కిందట వెంకటేశ్వర్లు,లక్ష్మి మణుగూరులో ఉంటున్న నాగేశ్వరరావు వద్దకు వచ్చారు. నాగేశ్వరరావు, తన భార్య, వెంకటేశ్వర్లు, అతని భార్య కలిసి కొత్తగూడెంలో సమీప బంధువు కర్మకాండలకు వెళ్లి కొత్తగూడెం నుంచి మణుగూరు వైపు తిరిగి వెళ్తుండగా కారుకు ఎదురుగా కుక్క అడ్డు రావడంతో తప్పించే ప్రయత్నంలో ఎదురుగా బొగ్గు లోడుతో ఆగి ఉన్న ఏపీ 20టీబీ 9729 నెంబర్ గల లారీని వేగంగా వెళ్తూ టీఎస్ 04ఈఎన్1816 అనె నెంబర్ గల కారు ఢీకొట్టింది. కారులో ఉన్న నాగేశ్వరరావు, అతని భార్య మంగలక్ష్మి తలకు బలమైన గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నాగేశ్వరరావు తమ్ముడు వెంకటేశ్వర్లు, మరదలు లక్ష్మి, డ్రైవర్ చైతన్యలకు కూడా బలమైన గాయాలయ్యాయి. అంతేకాకుండా కొత్తగూడెంకు చెందిన ఫోటోగ్రాఫర్ పండు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులైన నలుగురిని వైద్య చికిత్సల నిమిత్తం 108 వాహనం ద్వారా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ చైతన్యను గ్రామస్తులు, పోలీసులు అతి కష్టంగా బయటకు తీశారు. మృతులు నాగేశ్వరరావు, మంగలక్ష్మి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సీఐ అల్లం నరేందర్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంజీ తెలిపారు. సంఘటన స్థలిని సీఐ అల్లం నరేందర్ సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తూళ్ళూరి బ్రహ్మయ్య, మండల టీఆర్‌ఎస్ నాయకుడు గద్దెల లక్ష్మారెడ్డి సంఘటన స్థలికి చేరుకొని మృతుల కుటుంబాలను ఓదార్చారు. వారి కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యుత్ సరఫరాలో ట్రాన్స్‌కో విజయం
ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను పూర్తి స్థాయిలో ఇవ్వడంలో జిల్లా ట్రాన్స్‌కో విజయం సాధించిందని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విద్యుత్ అధికారులు కృషి చేస్తున్నారని ఖమ్మం ఎస్‌ఇ కె రమేష్ అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదేశాలు ఇవ్వటంతో ఇరు జిల్లాల్లో ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశామని వెల్లడించారు. రెండు జిల్లాల పరిధిలో ఐపిడిఎల్‌పిడి కింద విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు వస్తున్నారన్నారు. ఈ పథకం కింద ఇప్పటికి 13 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4,260 ఐపిడిఎల్‌పిడి కింద కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వాటిని పూర్తి చేసి కనెక్షన్లు ఇస్తామని అన్నారు. ఈ పథకం కింద ఇంకా విద్యుత్ కనెక్షన్లు కావల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో ఉన్న 2,553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అన్నమనేని గోపాల్‌రావు ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 365 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా మార్చి 19వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 8వ తేదిన నిర్వహించనున్న పరిక్షల అనంతరం ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇరు జిల్లాల్లో మరికొన్ని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ యంత్రాంగం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.