క్రైమ్/లీగల్

పాల్వంచలో ఐదుగురు కిడ్నాపర్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, మే 17: ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వాహనంలో తిరుగుతున్న ఐదుగురు కిడ్నాపర్లను గురువారం పాల్వంచ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం తెలిపారు. ఈ సందర్భంగా కిడ్నాపర్లను హాజరుపర్చిన పాల్వంచ డీఎస్పీ బి శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన వ్యాపారి ఆకుల ప్రభాకర్‌ను కిడ్నాప్ చేయాలని హైదరాబాద్ వాసి రవి అలియాస్ రవీందర్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను కలిసి రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న హైదాబాద్ బోరబండకు చెందిన అబ్దుల్ రహెమాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్‌తివారి, హైదరాబాద్ బోయినపల్లికి చెందిన ఎండి ముజాహిద్, సికింద్రాబాద్‌కు చెందిన షేక్ నవాబ్‌పాషా, రంజిత్‌సింగ్‌లు అనుకున్న ప్రకారం బుధవారం జీడిమెట్లలో ఉన్న ఆకుల ప్రభాకర్‌ను కిడ్నాప్ చేసి ఇన్నోవా వాహనంలో భద్రాచలంకు వెళ్లారు. తిరిగి వీరందరూ గురువారం ఉదయం పాల్వంచ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండగా స్థానిక పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్, వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఇన్నోవా కారును ఆపాలని ప్రయత్నించారు. ఇది గమనించిన కిడ్నాపర్లు కారును ఆపకుండా వేగంగా వెళ్తుండటంతో ఎస్‌ఐ చేతిలో ఉన్న లాఠీ కారుపై విసరడంతో కారు డివైడర్‌కు ఢీకొంది. దీంతో కిడ్నాపర్ల గుట్టురట్టైంది. కారులో ఉన్న ఐదుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి వారివద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, ఒక తల్వారీ, కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించే ఇతర సామాగ్రిని, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆకుల ప్రభాకర్‌ను కిడ్నాప్ చేయాలని పన్నాగం పన్నిన రవి అలియాస్ రవీందర్‌ను త్వరలో పట్టుకుంటామని డీస్పీ తెలిపారు. పట్టుబడిన ఐదుగురు కిడ్నాపర్లు కోర్టుకు హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు. కిడ్నాపర్లను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ ముత్యం రమేష్‌ను డిఎస్‌పి అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో సిఐ ఎస్‌పి రాఘవేంద్రరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ బి రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.