బిజినెస్

ఐటిసి లాభం రూ. 2,653 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో స్వల్పంగా పెరిగింది. ఈసారి 2,652.8 కోట్ల రూపాయలుగా నమోదైతే, గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,635 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 9,102.7 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 8,800.2 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో ఐటిసి స్పష్టం చేసింది. ఇకపోతే సిగరెట్లు తదితర ఉత్పత్తులతో కూడిన ఎఫ్‌ఎమ్‌సిజి వ్యాపారం నుంచి ఐటిసి ఆదాయం గతంతో పోల్చితే ఈసారి 6,456.1 కోట్ల రూపాయల నుంచి 6,857.5 కోట్ల రూపాయలకు పెరిగింది. అలాగే హోటల్ వ్యాపార ఆదాయం 330.3 కోట్ల రూపాయల నుంచి 345.3 కోట్ల రూపాయలకు, పేపర్, ప్యాకేజింగ్ ద్వారా ఆదాయం 1,198.8 కోట్ల రూపాయల నుంచి 1,260 కోట్ల రూపాయలకు వృద్ధి చెందింది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార ఆదాయం మాత్రం 7.31 శాతం క్షీణించి 1,597.9 కోట్ల రూపాయల నుంచి 1,481 కోట్ల రూపాయలకు దిగజారింది.