అంతర్జాతీయం

ట్రంప్ అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ నేతల ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 14: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ క్రమేణా డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభలోని తొమ్మిది పార్లమెంటరీ కమిటీల చైర్మన్లు ఆమోదించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘జీవిత కాలంలోనే అత్యంత ముఖ్యమైన ఈ ఎన్నికల్లో మేము ఏటవాలు శిఖరంపై నిలబడి ఉన్నాం. అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’తో పాటు పార్లమెంట్ మరో ఎనిమిదేళ్లు డెమోక్రటిక్ పార్టీ ఆధీనంలో ఉండటాన్ని ఈ దేశం భరించలేదు. అందుకే మేము అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాం’ అని ప్రతినిధుల సభలోని తొమ్మిది పార్లమెంటరీ కమిటీల చైర్మన్లు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ తొమ్మిది మందిలో స్టీవ్ చాబొట్ (స్మాల్ బిజినిస్ కమిటీ), మైఖేల్ కొనావే (వ్యవసాయ కమిటీ), జెబ్ హెన్సార్లింగ్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ), కాండైస్ మిల్లర్ (హౌస్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ), జెఫ్ మిల్లర్ (వెటరన్స్ అఫైర్స్ కమిటీ), టామ్ ప్రైస్ (బడ్జెట్ కమిటీ), పీట్స్ సెషన్స్ (రూల్స్ కమిటీ), బిల్ షస్టర్ (రవాణా, వౌలిక వసతుల కమిటీ), లామార్ స్మిత్ (శాస్త్ర, ఖగోళ, సాంకేతిక పరిజ్ఞాన కమిటీ) ఉన్నారు.