అంతర్జాతీయం

సూర్యుడి మీదుగా.. ఓ చిన్న చుక్కలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: గగన తలంలో ఇదో అద్భుతం.. తనివితీరా ఆస్వాదించాల్సిన అరుదైన ఖగోళ పరిణామం.సూర్యుడు భూమికి మధ్యగా బుధగ్రహం సోమవారం రాత్రి పయనించింది. ఈ క్రమంలో ఇది సూర్యుడిపై ఓ చిన్న చుక్కగానే కనిపించింది. భారత్‌లో ఇది పరిపూర్ణంగా ద్యోతకం కావడం వల్ల దీన్ని ప్రతిఒక్కరూ తిలకించారు. ఓ శతాబ్ధకాలంలో కేవలం పదమూడు సార్లు మాత్రమే ఈ పరిణామం సంభవిస్తుంది. సూర్యుడి ఒక చివరి నుంచి మరోచివరికి బుధగ్రహం పయనించే క్రమంలో ఇది అతిసూక్ష్మమైన పరిమాణంలోనే ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధగ్రహం, భూమి ఒకే వరుసలోకి వచ్చినప్పుడే ఇలాంటి అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. మరో మూడు సంవత్సరాల్లో అంటే 2019 నవంబర్ 11న ఈ దృశ్యం పునరావృతమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అది భారత్‌లో కనిపించదు. అంటే మళ్లీ మనం దీన్ని చూడాలంటే 2032 నవంబర్ 13వరకూ ఆగాల్సిందే. తమ జీవిత కాలంలో ఇలాంటి ఘటనను చూస్తామోలేమోనన్న ఆతృతతో దేశ వ్యాప్తంగా చిన్నా, పెద్ద అన్న తేడాలేకుండా సోమవారం ఈ దృశ్యాన్ని కోటానుకోట్ల మంది బైనాక్యులర్లతో వీక్షించారు. సాధారణంగా మే, నవంబర్ నెలల్లోనే ఇది సంభవిస్తుందని అంటే ఏడు, పదమూడు, 33సంవత్సరాలకొకసారి మాత్రమే వీక్షించే వీలుంటుందని ఢిల్లీ నెహ్రూ ప్లానెటోరియం డైరెక్టరఖ్ ఎన్ రత్నశ్రీ తెలిపారు. ఈ ఖగోళ పరిణామాన్ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా అనేక పట్టణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో ఓ డార్క్‌రూమ్‌ను ఏర్పాటుచేసి సూర్యుడి మీదుగా బుధగ్రహ పయనం చాలా స్పష్టంగా కనిపించేలా చేశారు. ఆకాశం మబ్బులు పట్టినప్పటికీ కోల్‌కతాలో సాయంత్రం 4గంటల 41 నిముషాలకు ఇది కనిపించింది. సూర్యుడి పరిమాణంతో పోలిస్తే మెర్క్యూరీ చాలా చిన్నది కాబట్టి ఇది ఓ చిన్న చుక్కగానే కనిపించిందని వీక్షకులు తెలిపారు. భారత్‌తో పాటు ఐరోపా, ఆఫ్రికా, ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఇది కనిపించింది.