అంతర్జాతీయం

వారిపై జాలి చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో దాడులకు గురైన క్రైస్తవులపై జాలి చూపాలని, వారిని ఆదుకోవాలని, వారి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వాటికన్ సిటీలో జరిగిన ప్రార్థనా సమావేశాలకు హాజరైన ఆయన తన సందేశంలో సహజ న్యాయం అన్నివర్గాలకూ వర్తింపజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆఫ్రికా ఖండం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతానికి మిగతా దేశాలు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ‘తమ మత విశ్వాసాలను నిలబెట్టుకోడానికి, అనుసరించడానికి ప్రయత్నిస్తున్న క్రైస్తవులు, వివిధ మిషనరీల బోధకులు, సభ్యులు ఆఫ్రికా ఖండంలో కిడ్నాప్‌లకు గురవుతున్నారు. ఉగ్రవాదులు వారిని చిత్రహింసలపాలు చేస్తున్నారు. బుర్కినా పాసో, మాలి, నిగర్, నైజీరియాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ విధంగా అపహరణలకు, దాడులకు గురవుతున్న క్రైస్తవుల క్షేమానికి ప్రార్థనలు జరపండి’ అని పోప్ ఫ్రాన్సిస్ కోరారు. పెరుగుతున్న హింస, ప్రకృతి వైపరీత్యాలు, వివిధ రకాలైన వ్యాధుల నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలని కోరుతూ ఆయన ప్రార్థనలు చేశారు. సముద్రాలను కూడా శ్మశానవాటికలుగా మారుస్తున్నారంటూ ఆయన ఉగ్రవాద కార్యకలాపాలపై స్పందించారు. ఈ పరిస్థితి నుంచి మానవ సమాజం బయట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా దాడులకు పాల్పడడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా క్రిస్టియన్లంతా ఏకతాటిపై నిలిచి, శాంతి సందేశాలను ప్రపంచానికి చాటాలని ఆయన కోరారు.
'చిత్రం... వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బెసిలికా నుంచి క్రిస్మస్ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న పోప్ ఫ్రాన్సిస్