అంతర్జాతీయం

మాంద్యం గుప్పిట భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 24: భారతదేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకొందని.. తక్షణమే విధానపరమైన చర్యలతో పరిస్థితిని చక్కదిద్దాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విస్తరణ చర్యల వల్ల లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడినప్పటికీ 2019 ప్రథమార్థంలో చోటుచేసుకొన్న పరిణామాలు వృద్ధి రేటుకు ప్రతిబంధకం అయ్యాయని ఐఎంఎఫ్ డైరెక్టర్లు తమ తాజా నివేదికలో వెల్లడించారు. ఈ మాంద్యం పరిస్థితులకు ఒకదాని తరువాత ఒకటిగా అనేక ప్రతికూల పరిణామాలు కారణం అయ్యాయని తెలిపారు. ఈ మాంద్య పరిస్థితుల నుంచి త్వరితగతినే భారత్ బయటపడగలుగుతుందని తాము భావించినప్పటికీ తాజా పరిస్థితులు అందుకు ఏమాత్రం అనుకూలంగా లేవని ఐఎంఎఫ్ ఆసియాలో భారత్ మిషన్ అధ్యక్షుడు రనిల్ సల్‌గాడో అన్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి అత్యంత బలమైన రీతిలో సూక్ష్మ ఆర్థిక దిద్దుబాటు చర్యలను చేపట్టాలని కోరారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది కాబట్టి సుస్థిర అభివృద్ధి కోసం సంస్కరణల అజెండాను మరింత గట్టిగా అమలు చేయాలని తెలిపారు. మాంద్య పరిస్థితుల కారణంగా డిసెంబర్‌లో కూడా ఆర్థిక కార్యకలాపాలు పేలవంగానే సాగాయని ఇందుకు అనేక అంశాలు కారణం అయ్యాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు వినియోగ సామర్థ్యాన్ని అడ్డుకొంటున్నాయని.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులకు ప్రతిబంధకం అవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులకు జీఎస్‌టీ సహా అనేక సంస్థాగత సంస్కరణలు కూడా కారణమై ఉండొచ్చని తెలిపారు. భారత్ వృద్ధి రేటుకు సంబంధించిన అంచనాలు గతంలో కంటే కూడా తక్కువగానే ఉండొచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.