అంతర్జాతీయం

ట్రంప్‌పైనే చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాట్‌ఫోర్డ్, డిసెంబర్ 4: నాటో కూటమికి చెందిన దేశాధినేతల్లో ఎక్కువ మంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపైనే చర్చించినట్లు సమాచారం. నాటో సదస్సుకు వివిధ దేశాల నుంచి పలువురు నాయకులు హాజరయ్యారు. వారికి బకింహ్యామ్ ప్యాలెస్‌లో ఇచ్చిన విందులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడ్యూ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాంజుల్ మాక్రాన్, బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్, బ్రిటీష్ యువరాణి అనె్న, రాణి ఎలిజబెత్-2 తదితరులు హాజరయ్యారు. వీరిలో చాలా మంది ట్రంప్ నడవడిపైనే చలోక్తులు విసురుకుంటూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొంత మంది ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఆయనకు సంబంధించిన అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. 29 నాటో దేశాలు 70వ సదస్సులో పాల్గొననున్నాయి. ప్రపంచ శాంతిపై వీరు చర్చిస్తారు.