అంతర్జాతీయం

విక్టరీ డేలో పాల్గొనండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెసిలియా, నవంబర్ 14: వచ్చే ఏడాది మేలో జరగనున్న విక్టరీ డే ఉత్సవాలకు రావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన వీరిద్దరూ గురువారం నాడిక్కడ సమావేశమై పరస్పర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించుకోవడంతోపాటు దీన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముందుకు తీసుకెళ్లే అంశంపైనా మంతనాలు జరిపారు. ముఖ్యంగా భారత-రష్యాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే అంశాలపైనే వీరిద్దరూ దృష్టిపెట్టారు. పుతిన్‌తో అద్భుతమైన రీతిలో సమావేశం సాగిందని.. తమ చర్చల్లో ద్వైపాక్షిక అంశాలను సమీక్షించామని మోదీ తెలిపారు. వాణిజ్యం, భద్రత, సాంస్కృతిక రంగాల్లో రెండు దేశాల మధ్య విస్తృతంగా సహకారం కొనసాగుతోందన్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల వల్ల ప్రజల మధ్య కూడా సాన్నిహిత్యం పెరుగుతోందని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో పుతిన్, మోదీల మధ్య సమావేశం జరగడం ఇది నాలుగోసారి. తరచు ఈ విధమైన సమావేశాలు జరగడం వల్ల ద్వైపాక్షిక బంధం బలపడుతుందని మోదీ పేర్కొన్నారు. అలాగే రష్యా విక్టరీ డే ఉత్సవాలకు తనను ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని మోదీ తెలిపారు. 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 25 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చమురు, సహజ వాయువు దిగుమతుల విషయంలో ప్రగతి, నిలకడైన పరిస్థితి కొనసాగడం పట్ల కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వౌలిక సదుపాయాల రంగంలోనూ సాధించిన ప్రగతిని సమీక్షించారు. రక్షణ, పౌర అణు ఇంధన రంగంలో కూడా రెండు దేశాలు సన్నిహితంగా ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరు దేశాలకు భావ సారూప్యత ఉందని, ఇలాగే ముందుకు సాగాలని సంకల్పించారు. కాగా తమ దేశ విక్టరీ ఉత్సవాల్లో పాల్గొనాలని మోదీని ఆహ్వానించినట్టు పుతిన్ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మాస్కోలో విక్టరీ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పుతిన్ తెలిపారు. మే 9న జరిగే ఈ వార్షిక ఉత్సవాల్లో రష్యా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. దీర్ఘకాలంగా భారత్‌లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నామని, ఎన్నో ప్రాజెక్టులను ఉమ్మడిగా అమలుచేస్తున్నామని పుతిన్ తెలిపారు.
*చిత్రం...పుతిన్‌తో మోదీ భేటీ