అంతర్జాతీయం

అసలు వాస్తవ అంశాలు ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 26: కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి భారత్ ప్రభుత్వం చెబుతున్న దానికీ, తమకు అందుతున్న సమాచారానికీ ఏ రకమైన పొంతనా లేదని అమెరికా కాంగ్రెస్ సభ్యులు స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర స్థితిగతుల గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు విదేశీ పాత్రికేయులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు ఓ లేఖ రాశారు. కాశ్మీర్‌లో రాజకీయ, ఆర్థిక పరమైన సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఓ రోడ్ మ్యాప్ అందించాలంటూ భారత్‌ను అమెరికా కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాశ్మీర్ పరిణామాల గురించి పాత్రికేయులు విస్తృతంగా సమాచారాన్ని అందించినప్పటికీ అంతర్జాతీయ జర్నలిస్టులను కూడా అనుమతించాల్సిన అవసరం ఉన్నదని దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల విదేశాంగ శాఖ సహాయ మంత్రి అలీ సిజ్జీ వెల్స్ స్పష్టం చేశారు. ఆయితే భద్రతాపరమైన ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా కాశ్మీర్ సమాచారాన్ని విదేశీ జర్నలిస్టులు వెలుపల ప్రపంచానికి తెలియజేయలేకపోతున్నారని అన్నారు. కాశ్మీర్‌లో పాత్రికేయులు, ఇతర సభ్యులు స్వేచ్ఛగా తిరిగినప్పుడే అక్కడి సమాచారాన్ని ప్రపంచానికి అందించినప్పుడే పరిస్థితులు సాధారణంగా ఉన్నాయన్న వాదనకు బలం చేకూరుతుందని, ఎలాంటి జాప్యం లేకుండా స్వదేశీ, విదేశీ జర్నలిస్టులను కాశ్మీర్‌లోకి అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు భారత రాయబారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 370 అధికారణ రద్దు, మొబైల్-ఇంటర్నెట్ సర్వీసులను పూర్తిస్థాయిలో ఇంకా పునరుద్ధరించకపోవడాన్ని వారు తమ లేఖలో పేర్కొన్నారు.