అంతర్జాతీయం

కాశ్మీర్ పరిస్థితిని గమనిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 9: కాశ్మీర్ పరిస్థితులపై ఓ కనే్నసి ఉంచామని, అక్కడ పరిస్థితులను గమనిస్తున్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమైన ఆయన కాశ్మీర్ సమస్యపై ఒక పరిష్కారానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత్, పాక్ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యకు తెరదించాలని ఆయన సూచించారు. తమకు ఉన్న కొన్ని ప్రత్యేక కారణాలు, ప్రధాన ఆసక్తి కారణంగా పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమిళనాడులోని మామల్లాపురం (మహబలిపురం)లో భేటీకానున్న జీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పరస్పర ప్రాధాన్యత అంశాలపై పాకిస్తాన్‌కు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు ఇమ్రాన్‌కు హామీ కూడా ఇచ్చారు. ద్వైపాక్షిక చర్చలతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన ఇరుదేశాలకు సూచించారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇరుదేశాల మధ్య తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పకపోవచ్చని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కాగా, మోదీతో జరిగే భేటీలో జిన్‌పింగ్ ద్వైపాక్షిక అంశాలను చర్చిస్తారని చైనా ప్రభుత్వం బుధవారం పేర్కొంది. ప్రాంతీ య, అంతర్జాతీయ స్థాయి అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వస్తాయని తెలిపింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ భేటీ ఉపయోగపడుతుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.
*చిత్రం... చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్