అంతర్జాతీయం

హూస్టన్‌లో సిక్కు పోలీస్ అధికారి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్: భారత సంతతికి చెందిన ఓ సిక్కు పోలీస్ అధికారి హూస్టన్‌లో హత్యకు గురయ్యాడు. అమెరికా పోలీస్ విభాగంలో తమ మత సంప్రదాయాలను పాటించేందుకు అనుమతి పొందిన సిక్కుగా గుర్తింపు సంపాదించిన సందీప్ సింగ్ ధలివాల్‌ను ఓ వ్యక్తి పిస్టల్‌తో కాల్చి చంపాడు. హారిస్ కౌంటీ షెరీఫ్ అధికారిగా పని చేస్తున్న ధలివాల్ తన విధులను నిర్వహిస్తున్నప్పుడే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరణమని, 42 ఏళ్ల ధలివాల్ మృతి చెందడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని హారిస్ కౌంటీ షెరీఫ్ చీఫ్ ఎడ్ గంజాలెజ్ వ్యాఖ్యానించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ధలివాల్ గత 10 ఏళ్లుగా హారిస్ కౌంటీ షెరీఫ్‌లో పోలీస్ అధికారిగా విధులను నిర్వహిస్తున్నారు. తన మత విశ్వాసాలను అనుసరించి, తలపాగా ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాడు. టెక్సాస్ పోలీస్ విభాగంలో ఈ విధంగా ప్రత్యేక అనుమతిని సంపాదించుకున్న తొలి సిక్కుగా అందరికీ సుపరిచితమయ్యాడు. భార్య, ముగ్గురు పిల్లలుగల ధలివాల్ తన విధుల్లో భాగంగా ఓ వాహనాన్ని తనిఖీ నిమిత్తం ఆపాడు. కారులో, ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. ధనివాల్ కారును ఆపిన వెంటనే, వాహనం నుంచి దిగిన వ్యక్తి అతనిపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ధనివాల్‌ను హారిస్ కౌంటీ షరీఫ్ ఉన్నతాధికారులు హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కాగా, ధనివాల్‌పై కాల్పులు జరిపిన 47 ఏళ్ల వ్యక్తిని రాబర్ట్ సొలిస్‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై మర్డర్ కేసు పెట్టి, విచారణ ప్రారంభించారు. సాటి సిక్కుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ధనివాల్ టెక్సాస్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని హార్వే తుపాను ముంచెత్తినప్పుడు, సిక్కులందరినీ ఒక చోట చేర్చారు. తుపాను బాధితులకు విశేష సేవలు అందించారు. మానవతా వాదిగా అందరి ప్రశంసలు పొందారు. సిక్కు మత విశ్వాసాలను అనుసరిస్తూనే, ఎవరికి ఏ అవసరం వచ్చినా, సాయం చేసేందుకు అందరి కంటే ముందు ఉండేవాడని హారిస్ కౌంటీ షెరీఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నా రు. తాము ఒక గొప్ప మనవతా వాదిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
*సందీప్ సింగ్ ధలివాల్ (ఫైల్‌ఫొటో )