అంతర్జాతీయం

ఉగ్రవాదులను శిక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 27: మసూద్ అజర్, హఫీజ్ సరుూద్ వంటి ఉగ్రవాదులను శిక్షించాల్సిందేనని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. కాశ్మీర్‌పై చర్చలకు ఉగ్రవాదమే అవరోధంగా నిలుస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి 74వ సాధరణ సభకు హాజరయ్యేందుకు వచ్చిన అమెరికా తాత్కాలిక సహాయ మంత్రి అలైస్ వెల్స్ ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అవసరమైతే సహకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అలైస్ వెల్స్ ప్రస్తావిస్తూ, మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. అయితే, ఇరు దేశాల ప్రధానులు కోరితే, మధ్యవర్తిత్వానికి ట్రంప్ సిద్ధంగా ఉంటారని ఆమె తెలిపారు.
దేశంలో ఉన్న ఉగ్రవాదులను శిక్షించకుండా, ఉగ్రవాద కేంద్రాలను మట్టుబెట్టకుండా కాశ్మీర్ సమస్య కోసం పాకిస్తాన్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులపై చర్యలకు పాక్ ఉపక్రమిస్తే, అణు సామర్థ్యంగల ఈ దేశాల మధ్య చర్చలకు మార్గం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకళించడానికి గట్టి చర్యలు చేపట్టక తప్పదని ఆమె పాకిస్తాన్‌కు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ఉపేక్షించబోమని పాక్ పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఈ దిశగా బలమైన అడుగులు పడడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. హఫీజ్ సరుూద్, మసూద్ అజర్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాదులు పాక్‌లోనే ఉన్నారని, వారిపై ఇంత వరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె అన్నారు. వీరిపై విచారణ జరిపించి, శిక్షిస్తేనే పాక్ పట్ల ప్రపంచ దేశాలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత, పాక్‌తో సంబంధాలు మరింత దిగజారిన విషయం తెలిసిందే.
కాశ్మీర్ సమస్యను పలు సందర్భాల్లో, అంతర్జాతీయ వేదికలపై చర్చకు పెట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో పాక్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో, అలైస్ వెల్స్ చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.