అంతర్జాతీయం

ఇస్లాం అంటే ఉగ్రవాదం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 26: ఇస్లాం అంటే ఉగ్రవాదం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సి ఉందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో కలిసి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ, ‘ఉగ్రవాద ఇస్లాం’ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదని వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకూ ఒకే ఇస్లాం ఉందని, తామంతా మహమ్మద్ ప్రవక్తను కొలుస్తామని, ఆయన చూపిన మార్గంలోనే నడుస్తామని అన్నారు. ఇటీవల జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇస్లామిక్ ఉగ్రవాదానికి తెరదించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను ప్రమాదంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ మాటలను ఇమ్రాన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇస్లాంను ఉగ్రవాదంతో జత కట్టడం మంచిది కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోచనను విడనాడాలని అన్నారు. అమెరికాపై 9/11 ఉగ్రవాద దాడులు జరగక ముందు, ఎల్‌టీటీఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దాడులకు పాల్పడిందన్నారు. ఎల్‌టీటీఈకి చెందిన వారంతా హిందువులేనని ఇమ్రాన్ చెప్పారు. అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధం కాలంలో జపాన్‌కు చెందిన ఆత్మాహుతి దళాలు దాడులకు తెగబడ్డాయని గుర్తుచేశారు. అటు హిందూ, ఇటు బౌద్ధ మతాలను ఎవరూ ఈ దాడులకు కారణంగా పేర్కోలేదని అన్నారు. కానీ, 9/11 తర్వాత జరిగిన దాడులను ఇస్లామిక్ ఉగ్రవాదంగా పేర్కోవడంలో అర్థం లేదన్నారు. శాంతియుత సహజీవనాన్ని మహమ్మద్ ప్రవక్త బోధించాడని, ఆయన దృష్టిలో అందరూ సమానమేనని ఇమ్రాన్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ముస్లింలు అందరూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారని అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం అనే ఆలోచనా సరళిని మానుకోవాలని హితవు పలికారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాట్లాడుతూ మనుషులంతా ఒకటేనని, మతానికీ, ఉగ్రవాదానికీ సంబంధం లేదని వ్యాఖ్యానించారు. భావ ప్రకటన, మత స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

*చిత్రం... పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌