అంతర్జాతీయం

‘స్టార్టప్ ఇండియా’ను బలోపేతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 26: ప్రపంచం ఎదుర్కొంటున్న పోషకాహారలేమి, వ్యర్థాల నిర్వహణ వంటి సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం వేదికలను ఉపయోగించుకోవాలని, వాటిని బలోపేతం చేయాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సీఈఓలు, అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను కోరారు. బుధవారం ఇక్కడ జరిగిన 20 రంగాలకు చెందిన 42 మంది గ్లోబల్ సీఈఓలు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో నిలకడయిన రాజకీయ స్థిరత్వం, విధానాల అంచనా, అభివృద్ధి అనుకూల విధానాల గురించి నొక్కి చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధి, ప్లాస్టిక్ పునరుపయోగం, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈల) వ్యాపార పెరుగుదల, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ రంగానికి ఎక్కువ అవకాశాలు కల్పించే వాటి గురించి ఆయన నొక్కి చెప్పారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో న్యూయార్క్‌లో ఇండస్ట్రీ కెప్టెన్లు సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచడం, భారత్, అమెరికా మధ్య వాణిజ్య అనుసంధానతకు ఊతమివ్వడం సహా విస్తృతమయిన అజెండాతో ఈ సమావేశం జరిగింది’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొంది. ‘న్యూయార్క్‌లో జరిగిన సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాన మంత్రి భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి తీసుకున్న చర్యలను వివరించారు. భారత్ విజయ గాథ గురించి ప్రపంచ వ్యాపార సమాజం ఆశావాద దృక్పథాన్ని ప్రదర్శించింది’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ మరో ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. సులభతర వ్యాపారం కోసం భారత్ చేస్తున్న కృషిని, పెట్టుబడిదారుల కోసం సామరస్యపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి తీసుకున్న అనేక చర్యలను సీఈఓలు (ముఖ్య కార్యనిర్వహణ అధికారులు) ప్రశంసించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని, భారత్‌ను మరింత పెట్టుబడిదారుల అనుకూల దేశంగా చేస్తున్నారని వారు ప్రశంసించారు.

*చిత్రం... న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సీఈఓల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ