అంతర్జాతీయం

ఇండోనేషియాలో భారీ భూకంపం:20 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాన్ సిటీ (ఇండోనేషియా), సెప్టెంబర్ 26: ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంలో కనీసం 20 మంది మృతి చెందారు. ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. మలుకూ ద్వీపాన్ని గురువారం ఉదయం భూకం పం అతలాకుతలం చేసిందని, రెస్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 6.5 మాగ్నిట్యూడ్‌గా నమోదైందని ప్రకృతి వైపరీత్యాల నిర్వాహణ విభాగం చీఫ్ ఆగ్నస్ విబోవో ఒక ప్రకటనలో తెలిపారు. 20 మంది మృతి చెందారని, వివిధ భవనాలు కూలడంతో, శిథిలాల కింద మరి కొంత మంది చిక్కుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గాయపడిన సుమారు వంద మందిని ఆసుపత్రికి తరలించామని, రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని విబోవో వివరించారు. ఒకవైపు కొండ చరియలు విరిగిపడడం, భవనాలు కుప్పకూలడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు నాలుగు లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కూలిన భవనాల శిథిలాలను తొలగించేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సహాయక బృందాలు పరిస్థితిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.