అంతర్జాతీయం

చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 11: కాశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్ దేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్) సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ సూచించారు. కాశ్మీర్ అంశంతో ఇరు దేశాల మధ్య అగాధం నెలకొందన్నారు. ఫ్రాన్స్, బైర్రిట్జ్‌లో గత నెల జరిగిన జి-7 దేశాల సమ్మిట్ జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీతో అంటోనియో గుటెర్రెస్ వేర్వేరుగా చర్చలు జరిపారని ఐక్యరాజ్య సమితి ప్రధాన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజర్రిక్ మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. పాకిస్తాన్ శాశ్వత అధికార ప్రతినిధి మలీహ లోధి విజ్ఞప్తి మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ సమావేశమై కాశ్మీర్ అంశంపై మంతనాలు చేసినట్లు ఆయన డుజర్రిక్ వివరించారు. భారత్-పాక్ దేశాల నేతలు కాశ్మీర్ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గుటెర్రెస్ సూచించినట్లు ఆయన తెలిపారు.
ఈ అంశంపై భారత్-పాక్‌ల మధ్య యూఎన్ మధ్యవర్తిత్వం చేయడం అనేది ఎంత వరకు సాధ్యం అనేది మీకూ తెలుసునని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఇలాఉండగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైనే తేల్చుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే ప్రకటించగా, ఈ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పలు పర్యాయాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.