అంతర్జాతీయం

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 10: కాశ్మీర్ అంశంపై భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రెండు వారాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకరించేందుకు తాను సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు. అయితే రెండు దేశాలు కోరితేనే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన పేర్కొన్నారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లో ఆగస్టు 26న ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడిగా భేటీ అయిన తరువాత ట్రంప్ ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. ‘్భరత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ అంశంపై ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న విషయం మీకు తెలిసిందే. రెండు వారాల క్రితంతో పోలిస్తే అది ఇప్పుడు కాస్త తగ్గిందని నేను భావిస్తున్నాను’ అని ట్రంప్ సోమవారం వైట్ హౌస్ వద్ద విలేఖరులకు చెప్పారు. భారత్ గత నెల అయిదో తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసిన తరువాత ఈ రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితిపై ట్రంప్ అంచనా గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘నేను రెండు దేశాలతో కలిసి బాగా పనిచేశాను’ అన్నారు. ‘అవి కోరితే వాటికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం వాటికి తెలుసు’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జూలైలో వాషింగ్టన్‌లో తనతో భేటీ అయిన సందర్భంగా ట్రంప్ కాశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే, భారత్ ఆ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. కాశ్మీర్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది.