అంతర్జాతీయం

పిఓకేను ఖాళీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: పాకిస్తాన్‌తో చర్చల విషయంలో భారత్ తన వైఖరిని మరింత స్పష్టమైన వైఖరిని కనబరిచింది. కాశ్మీర్ వివాదంపై చర్చించడానికి ఇస్లామాబాద్‌కు రావలసిందిగా పాకిస్తాన్ చేసిన తాజా ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఉగ్రవాద సమస్యే తమకు ముఖ్యమైన అంశమని పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదంపై చర్చలకు తాము సిద్ధమని తెగేసి చెప్పింది. జమ్మూకాశ్మీర్ వివాదంపై చర్చించడానికి ఈ నెలాఖరులోగా ఇస్లామాబాద్‌కు రావలసిందిగా కోరుతూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి ఆగస్టు 19న పంపిన తాజా ఆహ్వానానికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎ.జయశంకర్ బదులిస్తూ పాకిస్తాన్ గడ్డపై వేళ్లూనుకున్న సీమాంతర ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. జయశంకర్ రాసిన లేఖను ఇండియన్ హైకమిషనర్ గౌతమ్ బంబవాలే బుధవారం చౌదరికి అందజేసినట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ (పిఒకె)ను ఆ దేశం వీలయినంత త్వరగా ఖాళీ చేయవలసిన అవసరాన్ని జయశంకర్ తన లేఖలో మరోసారి నొక్కిచెప్పినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. చౌదరి ఆగస్టు 19న జయశంకర్‌కు రాసిన లేఖ గత పది రోజుల్లో రెండోది కావడం విశేషం. ఆయన తన మొదటి లేఖను ఆగస్టు 15న రాశారు. జమ్మూకాశ్మీర్‌లో అమాయక ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు వెంటనే స్వస్తి పలకాలని, క్షతగాత్రులకు ఔషధాలు సరఫరా చేయడానికి, తమ దేశానికి చెందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది జమ్మూకాశ్మీర్‌ను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని కూడా పాకిస్తాన్ తన లేఖలో భారత్‌ను కోరింది.