అంతర్జాతీయం

కాశ్మీర్‌పై ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలెక్కించడానికి పాకిస్తాన్ ఎప్పుడు ప్రయత్నించినా అది బెడిసి కొడుతూనే వచ్చింది. ఈ సారి భద్రతా మండలి సాక్షిగా పాకిస్తాన్‌కే కాదు దానిని వెనకేసుకుని వస్తున్న చైనాకు కూడా చుక్కెదురైంది. భద్రతా మండలిలో శుక్రవారం జరిగిన సభ్య దేశాల చర్చలకు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు ఈ రెండు దేశాలకు చెంప పెట్టులాంటి పరిస్థితే ఎదురైందని స్పష్టం చేస్తున్నాయి. కాశ్మీర్‌లో 370-అధికరణ రద్దు తమ రాజ్యాంగ అవసరమని, ఇది అంతర్జాతీయ సమస్య ఎలా అవుతుందని భారత్ కుండబద్ధలు కొట్టినట్లు చేసిన వాదన ఫలించింది. కాశ్మీర్ వ్యవహారం ద్వైపాక్షికమేనని భారత్-పాకిస్తాన్‌లే దీనిని పరిష్కరించుకోవాలంటూ మండలి సభ్య దేశాలు పెద్ద సంఖ్యలో స్పష్టం చేయడంతో ఇక ఈ అంశాన్ని ప్రపంచ సమస్యగా సృష్టించేందుకు పాక్ ప్రయత్నాలు ఇంక ఎంత మాత్రం ఫలించే అవకాశం లేదు. చైనా అభ్యర్థన మేరకే ఐదు శాశ్వత సభ్య దేశాలు, 10 శాశ్వతేతర దేశాల మధ్య కాశ్మీర్‌పై చర్చ జరిగింది. చర్చల అనంతరం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చైనా ప్రతినిధి జాంగ్ జున్, పాకిస్తాన్ ఐరాస రాయబారి మలీహ లోహి చర్చల అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోవడాన్ని బట్టి చూస్తే ఈ రెండు దేశాలకు ఎటువంటి పరిస్థితి ఎదురైందో స్పష్టమైంది. ఈ చర్చలకు సంబంధించి మీడియాకు ఓ ప్రకటన చేయాలంటూ ఇటు చైనా అలాగే యూనైటెడ్ కింగ్డమ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మొత్తం 15 దేశాల్లో మెజారిటీ సభ్య దేశాలు సంప్రదింపులపై ఎలాంటి ప్రకటన చేయకూడదని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. దాంతో చైనా, పాక్‌లు తమ తమ జాతీయ స్థాయిలోనే ప్రకటనలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రెండు దేశాల వాదనను భారత్ చీల్చి చెండాడమే కాకుండా తన వాదనను చాలా బలంగా తెలియజేయడమే మండలిలో విజయానికి కారణమని చెబుతున్నారు. 370-అధికరణ రద్దు కాశ్మీర్‌లో పరిస్థితి ప్రతికూలంగా మారిపోయిందని పాకిస్తాన్ వాదిస్తున్న నేపథ్యంలో చైనా-పాక్ ఆర్థిక కారిడార్ సంగతేమిటన్న ప్రశ్న కూడా తలెత్తిందని మండలి చర్చల్లో సన్నిహితంగా మెలిసిన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనా మితిమీరిన స్థాయిలోనే వ్యవహారించిందని, అంతిమంగా రిక్త హస్తాలతో బయటకు వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. మండలిలో కాశ్మీర్‌పై చర్చ జరగాలని పట్టుబట్టడానికి ముందే ఈ అంశంపై పాకిస్తాన్ అనేక విధాలుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. దీనిపై మండలిలో బహిరంగ చర్చే జరగాలని డిమాండ్ చేసినా అది కూడా ప్రతికూలించింది. మొత్తం మీద కాశ్మీర్‌పై మండలిలో జరిగిన తాజా పరిణామాలు ఇప్పట్లో పాక్-చైనాలు దీనిపై ఏ విధంగానూ ముందుకు వెళ్ళలేని పరిస్థితినే కల్పించాయి. ఈ సమస్య దైపాక్షికమేనని మెజారిటీ సభ్య దేశాలు చెప్పడంతో పాకిస్తాన్ దూకుడుకు కళ్లెం వేసినట్లే అయ్యింది.