అంతర్జాతీయం

పాక్ మసీదులో పేలిన బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 16: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ఓ మసీదు శక్తివంతమైన బాంబు పేలడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇక్కడి క్విట్టా, కుచ్‌లాక్ ప్రాంతంలో ఉన్న మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన జరుగుతున్న సమయంలో బాంబు పేలింది. సుమారు 10 కిలోల శక్తివంతమైన, మెరుగైన పేలుడు పరికరాన్ని (ఐఇడి) ముందుగానే మసీదులో అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రార్థన చేసేందుకు చాలా మంది మసీదులోకి వచ్చిన తర్వాత బాంబును పేల్చడం ద్వారా 5 మంది మృతి చెందారని, గాయపడిన 15 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడిందనేది ఇంకా తెలియలేదన్నారు. సాధారణంగా తాలిబన్ ఉగ్రవాదులు, బలూచ్ జాతీయ సంస్థ ఇటువంటి మారణకాండలకు పాల్పడుతుందని పోలీసులు అంటున్నారు. జూలై 30న కూడా క్విట్టాలో బాంబు పేలుడు ఘటన జరగడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా 32 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.