అంతర్జాతీయం

జైలు దాటిన హంతకుడి లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఆగస్టు 14: క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో 51 మందిని హతమార్చిన కేసులో నిందితుడు బ్రెంటన్ టారంట్ తన జైలు గదిలోనుంచి చేతితో రాసిన లేఖను బయటకు పంపించడానికి తాము అనుమతివ్వడం పొరపాటేనని న్యూజిలాండ్ అధికారులు బుధవారం అంగీకరించారు. బ్రెంటన్ టారంట్ రాసిన ఆరు పేజీల లేఖను ఈ వారం 4చాన్ అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. శే్వత జాత్యహంకారులు తమ దృక్పథాలను పంచుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్ వేదికగా నిలుస్తోంది. ఎల్ పాసో నుంచి నార్వే వరకు గల శే్వత జాతి దురహంకారులయిన హంతకులు టారంట్ తమకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. రష్యాలోని ‘అలన్’ను ఉద్దేశించి టారంట్ చిన్న నోట్‌ప్యాడ్‌పై పెన్సిల్‌తో ఈ లేఖను రాశాడు. టారంట్ ఈ లేఖలో 2015లో తాను నెల రోజుల పాటు జరిపిన రష్యా పర్యటన గురించి ఎక్కువగా రాశాడు. అయితే, ‘పెద్ద సంఘర్షణ’ జరుగబోతోందని టారంట్ ఆ లేఖలో హెచ్చరించాడు. టారంట్ రాసిన లేఖ బయటకు రావడం న్యూజిలాండ్‌తో పాటు ఇతర దేశాలలోనూ కలకలం సృష్టించింది. టారంట్ చేతితో రాసిన ఆ లేఖను బయటకు పంపించడానికి జైలు వ్యవస్థ అనుమతించిందంటే తాను నమ్మలేదని న్యూజిలాండ్ కరెక్షన్స్ మినిస్టర్ కెల్విన్ డేవిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇలాంటి సంఘటన మరోసారి జరుగబోదని నేను స్వయంగా స్పష్టంగా చెబుతున్నాను’ అని డేవిస్ పేర్కొన్నారు. అయితే, న్యూజిలాండ్‌లోని ఖైదీలందరికీ లేఖలు పంపించే, స్వీకరించే హక్కులు ఉన్నాయని కూడా డేవిస్ తెలిపారు. టారంట్ తరువాత లేఖలు పంపించడానికి, స్వీకరించడానికి చేసిన ప్రయత్నాలను జైలు అధికారులు అడ్డుకోవడం జరిగిందని డేవిస్ తెలిపారు. టారంట్ లేఖ బయటకు వెళ్లిన సంఘటన తమ దేశ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందా? అనే ఆలోచనను తమలో కలిగించిందని, ఎలాంటి మార్పులు చేయాలనే విషయమై సలహాలు కూడా అడిగామని డేవిస్ వివరించారు.