అంతర్జాతీయం

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 7: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగిన (బ్రెగ్జిట్) అనంతరం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని బ్రిటన్ కోరుకుంటోంది. అందువల్ల బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తమ దేశ విదేశాంగ మంత్రిని, విదేశీ వాణిజ్య శాఖ మంత్రిని అమెరికాకు పంపించారు.
బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డోమినిక్ రాబ్ అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియోతో చర్చలు జరుపనున్నారు. బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి లిజ్ ట్రస్ అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి వాణిజ్య అధికారులతో చర్చలు జరుపనున్నారు. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా బ్రిటన్ అక్టోబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగుతుందని బ్రిటన్ ప్రధానమంత్రి జాన్సన్ గట్టిగా చెబుతున్నారు. అందువల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి బ్రిటన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. జాన్సన్ కూడా తన లాంటి ఆలోచన విధానం గల నేత అని ట్రంప్ భావిస్తున్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగిన తరువాత బ్రిటన్, అమెరికాల మధ్య వాణిజ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ట్రంప్ ఇదివరకే చెప్పారు.
జాన్సన్ గత నెలలో బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ట్రంప్ ఆయనతో మాట్లాడుతూ కొన్ని రోజుల్లోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని చెప్పారు. ‘అమెరికాతో కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరపడం, ఒప్పందం కుదుర్చుకోవడం నా ప్రాధాన్యతాంశం’ అని ట్రస్ పేర్కొన్నారు.