అంతర్జాతీయం

దురాక్రమణ చేస్తే తిప్పికొడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: భారత్ ఎలాంటి దుస్సాహసం లేదా దురాక్రమణకు పాల్పడ్డా తీవ్ర స్థాయిలో సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరించారు. కాశ్మీర్ ప్రజలకు దౌత్యపరంగా, నైతికంగా, రాజకీయంగా మద్దతును కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ప్రజల ఆకాంక్షల మేరకు చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన భారత్‌కు స్పష్టం చేశారు. కాశ్మీర్‌కు సంబంధించి భారత్‌లో చకచకా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ అందులో తాజా పరిస్థితులపై చర్చించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలపై భారత్ క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుందంటూ సైన్యం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఈ సమావేశం జరిపారు. అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ ఉల్లంఘిస్తోందని, భారత్ చర్యల వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని ఇమ్రాన్ తెలిపారు. భారత భాద్యతారహిత, ఏకపక్ష ధోరణిపై దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు, కాశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అయితే క్లస్టర్ బాంబుల ఆరోపణలను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ భద్రతా కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి దేశీయ వ్యవహారాల మంత్రి పాల్గొన్నారు. భారత్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఈ సమావేశం స్పష్టం చేసింది. భారత్ చర్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్న చందంగా ఉన్నాయని దుయ్యబట్టింది. ఆఫ్ఘానిస్తాన్ వివాదాన్ని పరిష్కరించడంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాలు తలమునకమైన తరుణంలో భారత్, కాశ్మీర్‌పై ఈ రకంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టింది.

చిత్రం...పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్