అంతర్జాతీయం

అడెన్‌లో ఆత్మాహుతి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెన్, ఆగస్టు 1: యెమెన్‌లో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరుగుతున్న పోరు తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారులు హింసకు దిగారు. అడెన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో కనీసం 51 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సైనిక కవాతు జరుగుతున్న సమయంలో, హౌతీ దళ సభ్యులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఇరాన్ అండతోనే హౌతీ రెబల్స్ ప్రభుత్వ వ్యతిరేక దాడులకు దిగుతున్నారన్నది బహిరంగ సరహ్యం. అడెన్‌లో ఒకవైపు ఆత్మాహుతి దాడులు జరిగితే, అదే సమయంలో సైనిక స్థావరాలపై రెబెల్స్ క్షిపణులను ప్రయోగించారు. దీనితో అక్కడి సైనిక భవనం పాక్షికంగా ధ్వంసమైంది. 2015లో, అంతర్జాతీయ సమాజం గుర్తింపుతో యెమెన్‌లో సర్కారు ఏర్పడింది. అంతకు ముందు నుంచే ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పోరాడుతున్న హౌతీ సంస్థ 2014లో దేశ రాజధాని సనాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి అడెన్ అనధికార రాజధానిగా ఉంది. ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. అందుకే, అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అయితే, భద్రతా వలయాన్ని ఛేదించిన హౌతీ సభ్యులు ఏకంగా సైనిక స్థావరాలే ధ్యేయంగా దాడికి దిగడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. ఇలావుంటే, సైనిక కవాతుపై తమ సంస్థ మధ్యతరహా క్షిపణులను ప్రయోగించినట్టు హౌతీ రెబెల్స్ వెబ్‌సైట్ ఎల్-మసీరాకు హౌతీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనర్ యేహియా సరియా తెలిపారు. యూఏఈ మద్దతునిస్తున్న కమాండర్ మానియర్ అల్ యఫీ కూడా మృతుల్లో ఉన్నారని సరియా ప్రకటించారు. కాగా, ఒక కారు, ఒక బస్సు, మూడు మోటార్ సైకిళ్లపై ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయని అడెన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీతోపాటు అల్‌ఖైదాకు కూడా ఈ సంఘటనలో పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
చిత్రం...హౌతీ దళ సభ్యులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న స్థానికులు