అంతర్జాతీయం

నేపాల్‌లో కూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఆగస్టు 8: సెంట్రల్ నేపాల్‌లోని అటవీ ప్రాంతంలో సోమవారం ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో నవజాత శిశువు సహా అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఏడుగురూ దుర్మరణం చెందారు. ఫిష్‌టెయిల్ ఎయిర్ సంస్థకు చెందిన 9ఎన్-ఎకెఎ హెలికాప్టర్ చికిత్స నిమిత్తం తల్లీ, శిశువును ఖాట్మండుకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఈ హెలికాప్టర్ సోమవారం మధ్యాహ్నం గూర్ఖా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) టవర్‌తో సంబంధాలను కోల్పోయి ఖాట్మండుకు పశ్చిమ దిశగా దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్ జిల్లా భాటినే దండా ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ రంజన్ లింబు సహా అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులూ మరణించారని నేపాల్ పౌర విమానయాన సంస్థ (సిఎఎఎన్) వెల్లడించింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే నేపాల్ సైనిక బృందంతో పాటు రెస్క్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లారని సిఎఎఎన్ అధికార ప్రతినిధి కెసి.దేవేంద్ర తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడానికి కారణమేమిటన్నదీ ఇంకా తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరగాల్సి ఉందని ఫిష్‌టెయిల్ ఎయిర్ సంస్థ ఉన్నతాధికారి రమేష్ శివకోటి చెప్పారు.