అంతర్జాతీయం

ఐరాసలో ‘ఓం శాంతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 21: అంతర్జాతీయ శాంతిని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సహనశీలతను ఇనుమడింపజేయడంలో యోగా నిరూపమానమైన పాత్ర పోషిస్తోందని ఐక్యరాజ్య సమితి శ్లాఘించింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ‘ఓం శాంతి’ అనే నినాదాలతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మారు మోగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐరాస అధికారులు, దౌత్యవేత్తలు సహా వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. వీరితో పాటు యోగా గురువులు, పిల్లలు పెద్ద సం ఖ్యలో హాజరయ్యారు. ఐదో యోగ దినోత్సవాన్ని ఐరాసలోని భారత శాశ్వత మిషన్ నిర్వహించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ హాలులో ఇంత భారీ ఎత్తున యోగా కార్యక్రమం జరగడం ఇదే మొదటి సారి. 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలంటూ ఇక్కడే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. అనంతరం దీనిని ఆమోదించడంతో ఏటేటా జూన్ 21న ప్రపంచమంతా యోగా ముద్రను సంతరించుకుంటున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన ఐరాస డి ప్యూటీ సెక్రటరీ జనరల్ అనీమా మహ్మద్ ‘యోగా అం టే సమతుల్యత, మనలోనే కాదు మానవత్వంతో మన సంబంధాలను కూడా యోగా మెరుగుపరుస్తుంది..’ అన్నారు. యోగాను ఆచరించడం ద్వారా ఉత్తమ సమాజాన్ని సాధించేందుకు అవసరమైన స్పూర్తిని సంతరించుకోవచ్చునని, ఇటు పుడమిని, అటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. వాతావరణ మార్పులు నిరోధించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని వల్ల మానవాళి గుణాత్మకమైన అలవాట్లను సంతరించుకోగలుగుతుందన్నారు. అవసరాలు, కోరికల మధ్య ఉండే గందరగోళాన్ని నివారించడం ద్వారా సమతూకాన్ని సాధించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. పర్యావరణంతో మమేకమై మానవాళి పని చేయడానికి, సుహృద్భావాన్ని, సహేతుకతను బలోపేతం చేసుకోవడానికి యోగాను మించిన సాధనం లేదన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లోపల జరిగిన ఈ యోగా సమావేశం మరింతగా ప్రపంచ దేశాల ను ఈ దిశగా పునరంకితం చేయగలదన్న ఆశాభావాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా పుడమిని పరిరక్షించుకోవడంతో పాటు మానవ విలువలను పెంపొదించుకోవడానికి యోగా నిరుపమానమైందని తెలిపారు.