అంతర్జాతీయం

జాతీయ ప్రాధాన్యతలతోనే శాంతి సంస్థాపన సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 21: ఒక దేశ జాతీయ ప్రాథాన్యతలు, అలాగే ఆయా దేశాల నేతలు, సంస్థల క్రియాశీలక ప్రమేయంతో శాంతి సంస్థాపన ఫలితాలను, సుస్థిర ఫలితాలను అందిస్తాయని ఐక్యరాజ్య సమితిలో భారత్ స్పష్టం చేసింది. సోమవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజు నాయుడు ప్రసంగిస్తూ శాంతి సంస్థాపనతోనే దీర్ఘకాల ప్రయోజనాలు లభిస్తాయని, లోపాలనూ చక్కబెట్టుకోవచ్చని తమ దేశం విశ్వసిస్తుందన్నారు. ఆ దిశగా వివిధ దేశాలూ ‘పీస్ బిల్డింగ్ కమిషన్’ను ఏర్పాటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత కాలంలో అంతర్ రాష్ట్ర సంఘర్షణలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలు అధికమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘర్షణలతో వివిధ దేశాలు సతమతమవుతున్నాయని ఆయన తెలిపారు. శాంతి సుస్థిరత నిర్మాణానికి తమ దేశం ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నారు. దీనికి ప్రాంతీయ సంస్థల సహకారాన్ని తీసుకుంటామన్నారు. శాంతి సుస్థిర స్థాపనకు వివిధ పిబీసిలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.